Tuesday, January 7, 2025

ఈ పోకో ఫోన్ పై భారీ డిస్కౌంట్.. ఇప్పుడే కొనుగోలు చేయండి..

- Advertisement -
- Advertisement -

ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ బచాట్ డేస్ సేల్ జరుగుతోంది. ఈ సేల్ జనవరి 5 వరకు కొనసాగుతుంది. ఈ సేల్‌లో చాలా స్మార్ట్‌ఫోన్‌లపై డీల్స్, డిస్కౌంట్లు ఉన్నాయి. ఇందులో భాగంగా పోకో ఫోన్ నుండి 5G ఫోన్‌పై బెస్ట్ గొప్ప ఆఫర్ ఉంది. తక్కువ ధరలో అదిరిపోయే ఫీచర్లు ఉండే ఫోన్స్ తీసుకోవాలంటే ఇదే సరైన అవకాశం. డిస్కౌంట్ తర్వాత కస్టమర్లు ఈఫోన్ ను రూ.14 వేల లోపే కొనుగోలు చేయవచ్చు. ఇప్పుడు ఈ ఫోన్ కు సంబంధించి ఆఫర్స్, స్పెసిఫికేషన్స్ గురుంచి పుర్తిగా తెలుసుకుందాం.

ఆఫర్

పోకో M7 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 18,999కి లభిస్తోంది. అయితే ఆఫర్ తర్వాత ఈ ఫోన్ ను రూ.14,999కే కొనుగోలు చేయొచ్చు. అంటే.. ఇక్కడ ఎంఆర్‌పీపై రూ.4 వేలు రాయితీ వస్తోంది. కస్టమర్‌లు ఏదైనా బ్యాంక్ డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్‌లపై EMI కాని లావాదేవీలపై రూ. 1,000 అదనపు తగ్గింపును కూడా పొందవచ్చు.దీంతో ఈ ఫోన్ ధర రూ.13,999 అవుతుంది. ఇకపోతే ఈ ఫోన్‌పై రూ. 13,850 వరకు ఎక్స్‌ఛేంజ్ తగ్గింపు కూడా ఉంది.

స్పెసిఫికేషన్‌లు

పోకో M7 ప్రో 5జీలో 6.67-అంగుళాల పూర్తి-HD+ సూపర్ అల్మొడ్ డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ ఉంది. గరిష్ట ప్రకాశం స్థాయిలు 2,100నిట్‌లు, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 రక్షణను కలిగి ఉంది. ఇందులో మీడియా టెక్ డైమెన్సిటీ 7025 అల్ట్రా ప్రాసెసర్ ఉంది. ఈ ప్రాసెసర్ గరిష్టంగా 8జీబీ ర్యామ్ 256జీబీ వరకు ఆన్‌బోర్డ్ నిల్వతో జత చేయబడింది. ఇది ఆండ్రాయిడ్ 14 ఆధారిత హైపర్‌ఓఎస్‌పై నడుస్తుంది.

ఇక ఫోటోగ్రఫీ కోసం.. పోకో M7 ప్రో 5జీ లో 50-మెగాపిక్సెల్ సోనీ LYT-600 ప్రైమరీ సెన్సార్, వెనుకవైపు 2-మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంది. ఇక సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం.. 20-మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ సెన్సార్ ఉన్నాయి.

చివరికి బ్యాటరీ విషయానికి వస్తే.. పోకో M7 ప్రో 5జీ స్మార్ట్ ఫోన్ 45W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,110mAh బ్యాటరీని కలిగి ఉంది. కనెక్టివిటీ పరంగా.. ఇందులో 5జీ , 4జీ వొల్టీ, వై ఫై, బ్లూటూత్ 5.3, జీపిఎస్, 3.5mm ఆడియో జాక్, USB టైప్-సి పోర్ట్ ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News