Tuesday, January 7, 2025

అంతర్జాతీయ క్రీడాకారుల్ని తయారు చేసేలా టిజిఎస్‌పిని తీర్చిదిద్దుతాం: డిజిపి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఇద్దరు అంతర్జాతీయ క్రీడాకారులు టిజిఎస్‌పిలో చేరారని డిజిపి జితేందర్ తెలిపారు. ఒకరు నిఖత్ జరీన్, మరొకరు మహమ్మద్ సిరాజ్ అని తెలిపారు. యూసఫ్‌గూడలోని బెటాలియంలో పాసింగ్ అవుట్ పరేడ్‌లో 549 మంది కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. పాసింగ్ అవుట్ పరేడ్‌కు ముఖ్య అతిథిగా హాజరైన డిజిపి జితేందర్ ప్రసంగించారు. నిఖత్, సిరాజ్ సాయంతో ప్రత్యేక శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేశామని, అంతర్జాతీయ క్రీడాకారుల్ని తయారు చేసేలా టిజిఎస్‌పిని
తీర్చిదిద్దుతామని డిజిపి స్పష్టం చేశారు.

తెలంగాణ పోలీస్ యూనిఫాం ధరించడం గర్వంగా ఉందని ప్రముఖ బాక్సర్ నిఖత్ జరీన్ తెలిపారు. పోలీస్ అవుట్ పరేడ్‌లో నిఖత్ జరీనా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. పోలీస్ ఉద్యోగం రావడంతో తన కల నెరవేరిందని, టిజిఎస్‌పిలో బాక్సింగ్ శిక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తామని డిజిపి జితేందర్ చెప్పారని, బాక్సింగ్ శిక్షణ కేంద్రంలో తన వంత పాత్ర పోషిస్తామన్నారు. అంతర్జాతీయ క్రీడాకారులను తీర్చిదిద్దడానికి తన వంతు కృషి చేస్తానని నిఖత్ జరీన్ స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News