Tuesday, January 7, 2025

చలికాలంలో శరీరం వెచ్చగా ఉండాలంటే.. ఈ డ్రై ఫ్రూట్స్ తినాల్సిందే!

- Advertisement -
- Advertisement -

చలికాలంలో సూర్యరశ్మి తక్కువగా ఉంటుంది. ఈ సీజన్ లో సరైన ఆహారం తీసుకోకపోతే అర్యోగం మీద ప్రభావం పడుతుంది. అంతేకాకుండా రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. చలికాలంలో జలుబు, దగ్గు, ఇన్ఫెక్షన్ వంటి జబ్బులు వెంటాడుతాయి. వీటిని నివారించాలంటే మన శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవాలి. దీని కోసం ఆహారంలో కొన్ని డ్రై ఫ్రూట్స్‌ని చేర్చుకోవచ్చు. ఈ డ్రై ఫ్రూట్స్‌లో విటమిన్లు, మినరల్స్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జలుబు నుండి రక్షించడమే కాకుండా శరీరానికి శక్తిని ఇస్తాయి. ఈ క్రమంలో చలికాలంలో ఏ డ్రై ఫ్రూట్స్ శరీరానికి వెచ్చదనాన్ని ఇస్తాయో తెలుసుకుందాం.

 

బాదం

బాదం చలికాలంలో తినడానికి చాలా సరైనది. ఇందులో ప్రొటీన్, ఫైబర్, విటమిన్ ఇ, కాల్షియం, కాపర్, మెగ్నీషియం వంటివి పుష్కలంగా లభిస్తాయి. కావున కనీసం రోజుకు రెండు నుండి ఐదు నానబెట్టిన బాదంపప్పులను తినడం మంచిది. అందువల్ల ఇది శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది.

వాల్నట్

వాల్‌నట్స్‌లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు పుష్కలంగా ఉంటాయి. ఇది గుండె ఆరోగ్యానికి, మెదడుకు చాలా మేలు చేస్తుంది. ఇది కాకుండా.. వాల్‌నట్‌లు యాంటీఆక్సిడెంట్ల మంచి మూలం. ఇది వైరస్ ఇన్‌ఫెక్షన్లతో పోరాడడంలో ఎంతో సహాయపడుతుంది.

ఎండిన అంజీర్

ఎండిన అంజీర చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇందులో జింక్, మెగ్నీషియం, ఐరన్ వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. చలికాలంలో రోజూ అంజీర పండ్లను తినడం వల్ల రోగనిరోధక శక్తి బలపడుతుంది. అంతేకాకుండా జీర్ణవ్యవస్థను కూడా మెరుగ్గా ఉంచుతుంది. దీన్ని తినడం వల్ల మలబద్ధకం నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.

పిస్తాపప్పులు

పిస్తాలో పీచు, ప్రొటీన్ పుష్కలంగా ఉండటం వల్ల చలికాలంలో శరీరానికి శక్తినిస్తుంది. ఇందులో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడతాయి. చలికాలంలో రోజూ 3-4 పిస్తాపప్పులు మాత్రమే తినడం మంచిది.

జీడిపప్పు

జీడిపప్పు అనేది ప్రోటీన్, జింక్, మెగ్నీషియం వంటి ముఖ్యమైన ఖనిజాల నిధి. జింక్ రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి, మెగ్నీషియం కండరాలను మెరుగ్గా ఉంచడానికి పనిచేస్తుంది. రోజూ నిద్రపోయే ముందు జీడిపప్పును పాలతో కలిపి తింటే మంచి నిద్ర వస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News