Tuesday, January 7, 2025

ప్రతిరోజు బీట్‌రూట్‌ జ్యుస్ తాగుతున్నారా?

- Advertisement -
- Advertisement -

మన అర్యోగం మనం తీసుకునే ఆహారం మీద ఆధార పది ఉంటుంది. మనం హెల్తీగా ఉండాలని అనేక ఆహారాలను తీసుకుంటాము. అయితే భాగమే బీట్‌రూట్ జ్యూస్‌ కూడా ఒకటి. బీట్‌రూట్ లో యాంటీఆక్సిడెంట్లు, నైట్రేట్లు, విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. ఇవి మన శరీరానికి చాలా మేలు చేస్తాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇది మనల్ని శక్తిని ఉంచడమే కాకుండా జీర్ణవ్యవస్థను కూడా బలపరుస్తుంది. బీట్‌రూట్ రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. చర్మాన్ని ప్రకాశవంతం చేస్తుంది. రోగనిరోధక శక్తిని కూడా బలపరుస్తుంది. అయినప్పటికీ, బీట్‌రూట్ జ్యూస్‌ని అధికంగా తీసుకోవడం లేదా కొన్ని ఆరోగ్య పరిస్థితులలో త్రాగడం ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుందని ఆర్యోగ నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

 

బీట్‌రూట్‌ జ్యూస్ ఎక్కువగా తాగడం వల్ల అందులో ఉండే బీటా-సైనైన్ అనే వర్ణద్రవ్యం కారణంగా మూత్రం మరియు మలం గులాబీ లేదా ఎరుపు రంగులోకి మారవచ్చు. దీనినే బెటూరియా అంటారు. ఇది సాధారణంగా ఆర్యోగనికి హానికరం కాదు. కానీ, కొంతమందికి ఆందోళన కలిగించవచ్చు.

ఇందులో ఉండే నైట్రేట్‌లు రక్తపోటును తగ్గించడంలో ఎంతో సహాయపడతాయి. అయినప్పటికీ దీన్ని ఎక్కువగా తాగడం వల్ల చాలా తక్కువ రక్తపోటు వస్తుంది. ముఖ్యంగా.. ఇప్పటికే తక్కువ రక్తపోటు ఉన్నవారిలో దీని వల్ల కళ్లు తిరగడం, బలహీనత, మూర్ఛ వంటి సమస్యలు వస్తాయి.

అంతేకాకుండా బీట్‌రూట్‌లో అధిక మొత్తంలో ఆక్సలేట్‌లు ఉంటాయి. అందువల్ల మీరు దాని రసాన్ని ఎక్కువ పరిమాణంలో తాగితే, అది మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని పెంచుతుంది. ఆక్సలేట్‌లు కాల్షియంతో కలిసి మూత్రపిండాలలో స్ఫటికాలు ఏర్పడతాయి. అయితే, ఇవి కాలక్రమేణా రాళ్లుగా మారుతాయి.

బీట్‌రూట్‌లో పీచు పదార్థం ఎక్కువగా ఉండడం వల్ల అపానవాయువు, గ్యాస్, మలబద్ధకం లేదా అతిసారం వంటి సమస్యలు వస్తాయి. ఇక కొందరికి బీట్‌రూట్‌ తీసుకుంటే ఎలర్జీ కూడా రావచ్చు. ఇందులో భాగంగా చర్మంపై దద్దుర్లు, దురద, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఉండవచ్చు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News