Tuesday, January 7, 2025

బీఎస్ఎన్ఎల్ కొత్త రీఛార్జ్ ప్లాన్స్..

- Advertisement -
- Advertisement -

ఇటీవల ప్రముఖ టెలికాం సంస్థలు జియో, ఐడియా, ఎయిర్ టెల్ రీఛార్జ్ ప్లాన్ల ధరలను పెంచిన విషయం తెలిసిందే. దీంతో అనేక యూజర్లను తమ సిమ్ ను బిఎస్ఎన్ఎల్ కు పోర్ట్ చేసుకున్నారు. బిఎస్ఎన్ఎల్ యూజర్లను ఆకర్షించేందుకు అనేక కొత్త రీఛార్జ్ ప్లాన్స్ ను తీసుకువస్తోంది. ఈ క్రమంలో బిఎస్ఎన్ఎల్ తన 10 కోట్ల మంది వినియోగదారులకు నూతన సంవత్సర కానుకను అందించింది. కంపెనీ రూ. 215 రీఛార్జ్ ప్లాన్, రూ. 628 రీఛార్జ్ ప్లాన్ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ సరసమైన రీఛార్జ్ ప్లాన్‌లలో అపరిమిత కాలింగ్, ఉచిత SMS, హై-స్పీడ్ డేటా అందుబాటులో ఉన్నాయి.ఇప్పుడు ఈ ప్లాన్ల గురుంచి పూర్తిగా తెలుసుకుందాం.

రూ. 215 రీఛార్జ్ ప్లాన్‌

బిఎస్ఎన్ఎల్ రూ. 215 ప్లాన్‌ 30 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. వినియోగదారులు ప్రతిరోజూ 2GB హై-స్పీడ్ డేటాను కూడా పొందొచ్చు. అంటే.. నెలలో మొత్తం 60GB డేటా అందుబాటులో ఉంటుంది. అంతేకాకుండా ప్రతిరోజూ 100 ఉచిత SMSలను కూడా పొందొచ్చు.

రూ.628 రీఛార్జ్ ప్లాన్

బిఎస్ఎన్ఎల్ రూ. 628 ప్లాన్‌ 84 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. ఈ ప్లాన్‌లో ప్రతిరోజూ 3 GB హై-స్పీడ్ డేటాను పొందొచ్చు. అంటే.. 84 రోజుల్లో మొత్తం 252 జీబీ డేటా అందుతోంది. ఇది కాకుండా ప్రతిరోజూ 100 ఉచిత SMSలు కూడా కూడా పొందొచ్చు. అదనంగా, సబ్‌స్క్రైబర్‌లు హార్డీ గేమ్‌లు, ఛాలెంజర్ అరేనా గేమ్స్, గేమ్‌ఆన్, ఆస్ట్రోసెల్, లిస్టెన్ పాడ్‌కాస్ట్, జింగ్ మ్యూజిక్, వావ్ ఎంటర్‌టైన్‌మెంట్ బిఎస్ఎన్ఎల్ ట్యూన్స్ వంటి అనేక కాంప్లిమెంటరీ వాల్యూ యాడెడ్ సర్వీస్‌లకు యాక్సెస్ పొందొచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News