Tuesday, January 7, 2025

కేంద్రం ఢిల్లీలో ఏ పనీ చేయలేదు: కేజ్రీవాల్

- Advertisement -
- Advertisement -

బిజెపి నేతృత్వంలోని కేంద్రం ఢిల్లీలో అభివృద్ధి పని ఏదీ చేయలేదని, చేసి ఉంటే ప్రధాని నరేంద్ర మోడీ రాజధాని ప్రజలను. అతిపెద్ద తీర్పుతో వారు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని దూషించేందుకు తన 43 నిమిషాల ప్రసంగంలో 39 నిమిషాలు వెచ్చించి ఉండేవారు కాదని ఆప్ సుప్రీమో అర్వింద్ కేజ్రీవాల్ శుక్రవారం ప్రత్యారోపణ చేశారు. ఢిల్లీలో ఆప్ ప్రభుత్వంపై మోడీ వ్యాఖ్యలకు స్పందనగా కేజ్రీవాల్ విలేకరుల గోష్ఠిలో మాట్లాడుతూ, బిజెపి కేవలం ‘దూషణ రాజకీయాలకు’, ‘వ్యక్తిగత దాడులకు’ పాల్పడుతోందని ఆక్షేపించారు. ‘మోడీజీ తాజాగా తన ప్రసంగంలో ఢిల్లీ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని, వారిని దూషించడానికే మోడీజీ తన తాజా ప్రసంగంలో 39 నిమిషాలు వెచ్చించడం తప్ప చేసిందేమీ లేదు’ అని కేజ్రీవాల్ విమర్శించారు.

‘గడచిన పది సంవత్సరాల్లో మా ప్రభుత్వం చేసిన కృషిని వివరించడానికి తుదకు రెండు మూడు గంటలు కూడా సరిపోవు. మరొక వైపు, మోడీజీ తన ప్రసంగంలో చెప్పి ఉండే పని ఏదీ బిజెపి ప్రభుత్వం చేయలేదు. అది ఏదైనా కృషి చేసి ఉన్నట్లయితే, ఆయన ఢిల్లీ ప్రజలను నిందించి ఉండేవారు కాదు. ఢిల్లీ వాసులను దూషించడం ద్వారా ఎన్నికల్లో విజయానికి ఆ పార్టీ అంతగా ప్రయత్నం చేయవలసిన అవసరం ఉండేది కాదు’ అని ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అన్నారు. మోడీ శుక్రవారం ఉదయం అశోక్ విహార్‌లో ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఆప్‌ను ఢిల్లీకి ‘ఆపద’గా పేర్కొన్నారు. ఈ ‘ఆపద’ గత 10 ఏళ్లలో దేశ రాజధానిని తన గుప్పిట్లోకి తీసుకుందని మోడీ ఆరోపించారు. వచ్చే నెల జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి విజయం సాధిస్తుందనే దృఢవిశ్వాసాన్ని కూడాప్రధాని వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News