Tuesday, January 7, 2025

బిసి కులగణనను బిఆర్‌ఎస్ ఓర్వలేక పోతుంది: చామల కిరణ్‌కుమార్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ చిత్తశుద్ధితో బిసి కులగణన చేస్తుంటే బిఆర్‌ఎస్ ఓర్వలేక పోతుందని భువనగిరి ఎంపి చామల కిరణ్‌కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్ల పాలనలో ధర్నా చౌక్ లేకుండా చేసి బిసిలను విస్మరించిన ఘనత బిఆర్‌ఎస్ పార్టీదని, కవిత బిసిలకోసం ధర్నా చేయడం విడ్డూరంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ చేసే బిసి కులగణన తాము ధర్నా చేయడం వల్లే చేసిందని చెప్పుకోవడానికే ఎమ్మెల్సీ కవిత ఈరోజు ధర్నా కార్యక్రమం చేపట్టారని ఆయన ఓ ప్రకటనలో ఆరోపించారు. ఇందిరాపార్కులో కాదు మీ నాయన ఫాంహౌస్ ముందు ధర్నా చేయాలని ఆయన అన్నారు.

పది సంవత్సరాల్లో బిఆర్‌ఎస్ బిసిలను పట్టించుకున్న దాఖలాలు లేవని, బిసిలను విస్మరించింది బిఆర్‌ఎస్ అని ఆయన ఆరోపించారు. హనుమంతరావు, కేశవరావు, డి.శ్రీనివాస్ ప్రస్తుతం మహేష్ కుమార్ గౌడ్ లాంటి బిసిలకు కాంగ్రెస్ పెద్ద పీట వేసిందని ఆయన తెలిపారు. బిసి నాయకులను పిసిసి అధ్యక్షులను చేసిన ఘనత కాంగ్రెస్‌దేనని ఆయన పేర్కొన్నారు. బిఆర్‌ఎస్‌కు బిసిల పట్ల చిత్త శుద్ధి ఉంటే మీ పార్టీ అధ్యక్షునిగా బిసిని ప్రకటించాలని ఆయన సవాల్ విసిరారు. రాహుల్ గాంధీ అయినా రేవంత్ రెడ్డిదైనా కాంగ్రెస్ పార్టీది ఒకటే నిర్ణయం ఉంటుందని, వీలైతే మీరు కూడా కులగణనలో భాగస్వాములై సహకరించాలని ఆయన సూచించారు. ప్రజలను తప్పుదోవ పట్టించకుండా మీకు ధర్నా చేసే అధికారం లేదని చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News