Tuesday, January 7, 2025

జర్నలిస్టులకు ప్రభుత్వం శుభవార్త

- Advertisement -
- Advertisement -

జర్నలిస్టులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. బండ్లగూడ, పోచారం, గాజుల రామారం, జవహర్ నగర్‌లో రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ నిర్మించిన ఫ్లాట్‌లను ఓపెన్ యాక్షన్ ద్వారా విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం నిర్ణయించే కనీస ధరకు కొనుగోలు చేసుకోవడానికి ఆసక్తి గల జర్నలిస్ట్లు తమ పేర్లను ఇస్తే వారికి ఈ నాలుగు ప్రాంతాలలోని ఈ ఫ్లాట్లను చూపిస్తామని అధికారులు తెలిపారు. ఇందుకోసం జర్నలిస్ట్లు ఈ నెల 5వ తేదీలోగా తమ పేర్లను వాట్సాప్ ద్వారా 7702003518 నెంబర్‌కు వివరాలను పంపాలని, మరిన్ని వివరాలకు ఇదే నెంబర్‌లో సంప్రదించాలని, రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News