Tuesday, January 7, 2025

శనివారం రాశి ఫలాలు(04-01-2025)

- Advertisement -
- Advertisement -

మేషం – మీ ఆర్థిక స్థితి బలోపేతం అవుతుంది. ఇల్లు లేదా వ్యాపారం కోసం ఏదైనా ముఖ్య నిర్ణయం తీసుకుంటే జాగ్రత్తగా ఆలోచించాలి లేకుంటే అది భవిష్యత్తులో మీకు పెద్ద సమస్యలను సృష్టిస్తుంది.

వృషభం –  ఉద్యోగులు ఈరోజు ఏదైనా చర్చకు దిగాల్సి వస్తే అన్నింటిని పరిగణలోనికి తీసుకోవాలి. కొన్ని శుభ కార్యక్రమాలు చర్చించబడతాయి. ఇది మీ మనసును సంతోషంగా ఉంచుతుంది.

మిథునం – మీరు విధికి దేనిని వదిలేయాల్సిన అవసరం లేదని గ్రహించండి. మీరు ఎక్కడైనా పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తే చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టడం చెప్పదగిన సూచన.

కర్కాటకం – కొత్త విషయాలు నేర్చుకోవడంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. విద్యార్థులకు విద్యారంగంపై ఎక్కువ ఆసక్తి పెరుగుతుంది. సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది.

సింహం – పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి. ఇరుగుపొరుగు వారితో వివాదాలు తలెత్తే సూచనలుఉన్నాయి. జాగ్రత్త వహించాలి. పిల్లల తరపు నుండి ఇతరుల నుండి కొన్ని శుభవార్తలు వింటారు.

కన్య – వృత్తి ఉద్యోగాలలో సానుకూల ఫలితాలను పొందుతారు. నూతన వ్యాపారం చేయాలనుకునే వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. మీ కుటుంబంలో ఏమైనా గొడవలు ఉంటే అవి ఈరోజుతో ముగిసిపోతాయి.

తుల – వ్యాపారస్తులు ఒకదాని తర్వాత ఒకటి లాభదాయకమైన ఒప్పందాలను పొందుతారు. మీ బంధువుల నుంచి గౌరవం పొందుతారు. దూర ప్రయాణాలు లాభిస్తాయి. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు.

వృశ్చికం – ప్రైవేటు ఉద్యోగాలు చేసే వారికి నూతన ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి విజయం సాధించే అవకాశం ఉంది. సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు.

ధనుస్సు – వృత్తి వ్యాపారాలలో కొంత నష్టాలు వాటిల్లే సూచన. వ్యాపారంలో మందగమనం కారణంగా పెండింగ్లోఉన్న పనిని పూర్తిచేసే అవకాశం పొందుతారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది.

మకరం – అప్రయత్న కార్యసిద్ధి పొందుతారు. సంతాన వివాహానికి సంబంధించి ఏదైనా సమస్య ఉంటే పెద్దల సహాయ సహకారాలతో దాన్ని పరిష్కరించుకుంటారు. ధనం కొంత ఖర్చయ్యే సూచన.

కుంభం – ఉద్యోగస్తులు పై అధికారుల నుండి మాట పట్టింపులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీ పనిని ఆలోచనత్మకంగా చేయండి. ఆహార విషయాల్లో అజాగ్రత్తగా ఉండకండి.

మీనం – వ్యాపార భాగస్వామితో ఏదైనా వివాదం ఉంటే సమసిపోతుంది. వాతావరణ ప్రతికూల ప్రభావాలు కారణంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆరోగ్యపరంగా కొంత ఇబ్బందిగా ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News