Tuesday, January 7, 2025

అన్నదాతలు యాచకులా?

- Advertisement -
- Advertisement -

బిఆర్‌ఎస్ పాలనలో శాసించే
స్థాయిలో రైతులు నేడు
యాచించే స్థాయికి దిగజార్చిన
కాంగ్రెస్ ప్రమాణపత్రం
ఇస్తేనే రైతు భరోసా
ఇస్తామనడం దారుణం
రైతుబంధును బొందపెట్టే
ప్రయత్నం చేస్తున్న సర్కార్
రైతుబంధులో అవినీతి జరిగితే
విచారణ జరిపించండి : కెటిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రజాపాలనలో స్వీకరించిన దరఖాస్తులు కాకుండా.. రైతులు మళ్లీ కొత్తగా ఎందుకు ప్రమాణ ప త్రాలు ఇవ్వాలి..? అని రాష్ట్ర ప్రభుత్వాన్ని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ నిలదీశారు. రైతులు కాదు ప్రమాణపత్రాలు ఇ వ్వాల్సింది.. రేవంత్‌రెడ్డి ఇవ్వాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి ఎ న్నికల మేనిఫెస్టోలో హామీలు ఇచ్చారని గు ర్తు చేశారు. ఎన్నికలప్పుడేమో కాంగ్రెస్ నేత లు బాండ్ పేపర్లు రాసిచ్చారు.. ఇప్పుడేమో రైతులు ఊర్లలో ప్రమాణపత్రం ఇవ్వాలట అని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అ ధికారంలోకి వచ్చాక.. ప్రజాపాలన అని కిం ద అన్ని వర్గాల నుంచి దరఖాస్తులు స్వీకరించిందని, మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, చేయూత, ఇందిరమ్మ ఇండ్ల కోసం కోటి 6 లక్షల మంది దరఖాస్తులు పెట్టుకున్నారని చెప్పారు. ఈ సమాచారం ప్రభుత్వం దగ్గర ఉండాలి కదా..? ఇప్పుడేందుకు కొత్తగా రైతులను ప్రమాణపత్రాలు అడుగుతున్నారని అడిగారు. తెలంగాణ భవన్‌లో శుక్రవారం మాజీ మంత్రులు జగదీశ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, బిఆర్‌ఎస్ నేతలతో కలిసి కెటిఆర్ మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ, రైతు బంధు పథకం అమలు చేయడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజాపాలన అన్నారని, మొన్నటి దాకా కుల గణన, ఇప్పుడు మళ్లీ కొత్తగా ప్రమాణపత్రం ఇవ్వాలని అంటున్నారని మండిపడ్డారు. ప్రమాణపత్రం ఇస్తేనే రైతుభరోసా పైసలు ఇస్తాం అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో రైతును శాసించే స్థాయికి కెసిఆర్ తీసుకువచ్చారని గుర్తు చేశారు. కానీ రైతులు యాచించే స్థితికి కాంగ్రెస్ నేతలు తీసుకు వచ్చారని మండిపడ్డారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నేతలు అఫిడవిట్లు దేవుండ్ల వద్ద పెట్టారని, తాము రాగానే అమలు చేస్తామని డిక్లరేషన్ల పేరిట బిల్డప్‌లు ఇచ్చారని ఎద్దేవా చేశారు. కానీ ఇప్పుడు దిక్కుమాలిన విధానాలు తీసుకొస్తున్నారని మండిపడ్డారు.

రైతు భరోసా కింద ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు..
రైతుల మీద ప్రేమతో రైతు బంధు పథకాన్ని కెసిఆర్ తీసుకొచ్చారని కెటిఆర్ వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది అయినా రైతు భరోసా కింద ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని పేర్కొన్నారు. ఎన్నికల ముందు రైతు డిక్లరేషన్ పేరిట ఈ కాంగ్రెస్ నేతలు బిల్డప్ ఇచ్చారన్నారు. వానాకాలం పంట పెట్టుబడి ఎగ్గొట్టారని, దాన్ని జమ చేసే వరకు పోరాడుతామని స్పష్టం చేశారు. సంక్రాంతిలోగా రైతు భరోసా అమలు చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువద్దామని కార్యాకర్తలను పిలుపు ఇచ్చారు. ఏ ఊర్లో ఏ రైతుకు ఎంత రుణమాఫీ అయిందో దమ్ముంటే బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఈ ఊరిలో ఎంత మంది భూ యజమాలు, కౌలు రైతులు ఉన్నారో స్పష్టంగా చెప్పాలని అన్నారు. ఏ ఊరిలో బోనస్ ఎంత మందికి ఇచ్చారో, రైతు కూలీలు ఎంత మంది ఉన్నారో బయటపెట్టాలని సిఎం రేవంత్‌రెడ్డిని డిమాండ్ చేశారు. ఎంత మందికి రుణ మాఫీ చేశారు.. బోనస్ ఎంత మందికి ఇచ్చారో డిక్లరేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రైతులు ఊరురా నిలదీయాలి..
రైతు బంధును రాష్ట్ర ప్రభుత్వం బొంద పెట్టే ప్రయత్నం చేస్తోందని కెటిఆర్ మండిపడ్డారు. రైతుబంధులో రూ. 22 వేల కోట్లు పక్కదారి మళ్లాయని సీఎం, అధికారులు బద్నాం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి రూ. 22 వేల కోట్లు ఎవరి ఖాతాలో పోయాయో ప్రజలకు తెలియాలని అన్నారు. రైతుబంధు పంపిణీలో అవినీతి జరిగితే విచారణ జరిపించండని డిమాండ్ చేశారు. ఎవరికి అక్రమంగా రైతుబంధు నిధులు ఇచ్చామో లెక్కలు తీయండని ప్రభుత్వానికి సవాల్ చేశారు. రైతుబంధుపై రైతులను అప్రమత్తం చేయాలని కార్యకర్తలను కోరుతున్నానని పిలుపునిచ్చారు. అర్హులైన ప్రతి రైతుకు రైతుభరోసా ఇప్పించాల్సిన బాధ్యత మనపై ఉందని పార్టీ కార్యకర్తలను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. రైతులు మళ్లీ కొత్తగా ఎందుకు ప్రమాణ పత్రాలు ఇవ్వాలని ప్రశ్నించారు. కేబినెట్ సబ్‌కమిటీ ఐదేళ్లు పోయాక నివేదిక ఇస్తుందని తమకు సమాచారం అందిందని ఎద్దేవా చేశారు.

కౌలు రైతులకు ఎప్పటినుంచి రైతు భరోసా ఇస్తారని మరోసారి ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రూ.26,500 కోట్లు ఎగ్గొట్టిందని ఆరోపించారు. కంది, పత్తి, చెరుకుకు రెండో పంట ఉండదని, అయినా రైతు మంచిగా ఉండాలనే ఉద్దేశంతో బిఆర్‌ఎస్ హయాంలో రెండో పంటకు కూడా రైతుబంధు వేశామని తెలిపారు. అడ్డమైన మాటలు మాట్లాడుతున్నారంటే రైతుబంధు పథకానికి బొంద పెట్టడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశంలాగా కనబడుతుందని ఆరోపించారు. ప్రమాణ పత్రాల పేరుతో ప్రభుత్వం రైతులపై కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నదని ఆరోపించారు. రైతులను భయాందోళనలకు గురి చేసే కుట్రను చేస్తున్నదని మండిపడ్డారు. రైతులను దొంగలుగా చిత్రీకరించే ప్రయత్నం మానుకోవాలని సూచించారు. ప్రజా పాలనలో దరఖాస్తు ఇచ్చాం కదా.. మళ్లీ ప్రమాణ పత్రం ఎందుకు అని రైతున్నలు ప్రభుత్వాన్ని నిలదీయాలని పిలుపునిచ్చారు. 70 లక్షల ఖాతాలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయని, పొలం వివరాలు అన్నీ తెలుసు.. తెలిసీ కూడా ఈ ప్రయత్నం చేస్తున్నావంటే కటింగ్ పెట్టుందకు ప్లాన్ చేస్తున్నారని పేర్కొన్నారు. కాబట్టి రైతులు ఊరురా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయాలని సూచించారు.

చేత కాకపోతే రైతులను క్షమాపణ అడగాలి
కేబినెట్‌లో ప్రభుత్వం అన్ని ఆలోచించి అందరి రైతుల పక్షాన నిర్ణయం తీసుకోవాలని కెటిఆర్ అన్నారు. రైతులను భయపెట్టే కుట్రను అడ్డుకుంటామని పేర్కొన్నారు. ప్రమాణ పత్రాలు, దరఖాస్తులు వరంగల్ డిక్లరేషన్‌లో పెట్టారా..? అంటూ ప్రశ్నించారు. ఇచ్చిన హామీలు అమలు చేసే సత్తా లేకుండా రైతన్నలకు క్షమాపణ అడగాలని కెటిఆర్ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. శనివారం నుంచి పలు రకాల కార్యక్రమాల రూపంలో రైతాంగాన్ని చైతన్యవంతం చేద్దామని కెటిఆర్ బిఆర్‌ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News