Tuesday, January 7, 2025

చరణ్ గుర్రపు స్వారీ నా సినిమాల్లో మాత్రమే చెయ్యాలి!

- Advertisement -
- Advertisement -

మన టాలీవుడ్ స్టార్స్‌లో గుర్రపు స్వారీ అనే ప్రస్తావన వస్తే మొదటగా మెగాస్టార్ చిరంజీవి పేరు వినిపిస్తుంది. అయి తే తన తర్వా త ఆ రేంజ్ స్టైల్, స్వాగ్ ని మ్యాచ్ చేసింది మాత్రం తన వా రసుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అనే చెప్పాలి. అయితే చరణ్‌కి గుర్రపు స్వారీ మీద చాలా పట్టు ఉన్న సంగతి తెలిసిందే. తన రెండో సినిమా మగధీరలోనే గుర్రపు స్వారీతో అందరినీ అలరించాడు. ఇక అక్కడ నుంచి మొన్న ఆర్‌ఆర్‌ఆర్‌లో కూడా అలరించగా తాజాగా స్టార్ డైరెక్టర్ శంకర్ కలయికలో చేస్తున్న బిగ్గెస్ట్ చిత్రం గేమ్ ఛేంజర్ లో కూడా తెల్లటి గుర్రంపై కనిపించి ఆ శ్చర్యానికి గురి చేశా డు. అయితే మగధీర, ఆర్‌ఆర్‌ఆర్ చిత్రాల్లో రాజమౌళి… చరణ్‌ని ఓ రేంజ్ లో చూ పించిన సంగతి తెలిసిందే. ఇక గేమ్ ఛేంజర్ ట్రైలర్ లాం చ్ ఈవెంట్‌లో జక్కన్న చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. చరణ్ గుర్ర పు స్వారీ సీన్స్ చేస్తే కేవలం నా సినిమాల్లో మాత్రమే చెయ్యాలని ఒప్పం దం రాయించుకుంటా సరదాగా మాట్లా డి, ఆతర్వాత దర్శకుడు శంకర్‌కి సారీ చెప్పాడు. దీంతో చరణ్ గుర్రపు స్వారీ అంటే జక్కన్నకి ఎంతమక్కువ అనేది అర్ధం చేసుకోవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News