Tuesday, January 7, 2025

నేను రిటైర్మెంట్ తీసుకోలేదు… జట్టు కోసమే ఆ పని చేశా: రోహిత్ శర్మ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గత కొన్ని రోజులు ఫామ్‌లో లేక ఇబ్బంది పడుతున్నాడు. ఓపెనర్‌గా కూడా విఫలం కావడంతో పాటు అతడి స్థానంలో రాహుల్ ఓపెనర్‌గా మెరుగ్గా రాణిస్తున్నాడు. దీంతో జట్టు ప్రయోజనాల దృష్టా సిడ్నీ టెస్టులో ఆడకుండా విశ్రాంతి తీసుకుంటున్నానని రోహిత్ శర్మ వివరణ ఇచ్చారు. తాను ఇంకా రిటైర్మెంట్ తీసుకోలేదని, జట్టు అవసరాల కోసం మాత్రమే ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. ఆసీస్‌తో జరిగిన తొలి టెస్టులో రాహుల్-జైస్వాల్ డబుల్ సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పడంతో పెర్త్ టెస్టు గెలిచారని, ఓపెనర్లను మార్చకూడదని ఉద్దేశంతోనే తాను విశ్రాంతి తీసుకుంటానని ప్రకటించారు.

రెండో రోజు లంచ్ బ్రేక్ సమయంలో ఇర్ఫాన్ ఫఠాన్ తో రోహిత్ శర్మ మాట్లాడారు. మీడియాలో వస్తున్నట్లు డ్రెస్సింగ్ రూమ్‌లో ఎలాంటి గొడవలు జరగలేదని, తప్పుడు వార్తలను నమ్మవద్దని కోరాడు. ఇప్పుడు ఫామ్‌లో లేకపోవడంతో పరుగులు చేయలేకపోతున్నానని, భవిష్యత్‌లో పరుగులు చేయనని ఎవరైనా గ్యారంటీ ఇవ్వలేరని రోహిత్ శర్మ చురకలంటించారు. ఫామ్ కోసం నిరంతరం శ్రమించడంతో పాజిటివ్ మైండ్‌తో ముందుకెళ్తానని స్పష్టం చేశారు. ల్యాప్‌ట్యాప్, పేపర్, పెన్నులు ముందు వేసుకునే వారు తాను ఎప్పుడు రిటైర్మెంట్ తీసుకోవాలో చెప్పలేరని ఎద్దేవా చేశారు. తాను ఇద్దరు పిల్లల తండ్రిని అని, ఏ సమయంలో ఎలాంటి నిర్ణయాలతో తీసుకోవాలో తనకు భాగా తెలుసునని రోహిత్ శర్మ చెప్పుకొచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News