Wednesday, January 8, 2025

చుండ్రు సమస్యతో బాధపడుతున్నారా?

- Advertisement -
- Advertisement -

చలికాలంలో జుట్టులో చుండ్రు సమస్య సర్వసాధారణం అని చెప్పవచ్చు. చలికాలం ప్రారంభమైన వెంటనే జుట్టులో చుండ్రు సాధారణం అవుతుంది. చాలా మంది ఈ సీజన్ లో చుండ్రు సమస్యతో ఇబ్బంది పడుతుంటారు. అయితే కొన్ని సులభమైన చిట్కాలను అనుసరించడం ద్వారా మీరు ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చు. ఇటివంటి పరిస్థితిలో చలికాలంలో ఎలాంటి చిట్కాలు అనుసరిస్తే జుట్టులో చుండ్రుని వదిలించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

చలికాలంలో జుట్టును క్రమం తప్పకుండా కడగడం చాలా ముఖ్యం. దీనితో జుట్టులో పేరుకుపోయిన నూనె, మురికి తొలగిపోతుంది. ఇది చుండ్రుకు కారణం కావచ్చు. జుట్టును క్రమం తప్పకుండా కడగకపోతే, జుట్టులో చుండ్రు సమస్య వస్తుంది.

అలాగే యాంటీ డాండ్రఫ్ షాంపూలో చుండ్రును నియంత్రించడంలో సహాయపడే పదార్థాలు ఉంటాయి. ఈ షాంపూలను స్నానం చేసేటప్పుడు రెగ్యులర్ గా ఉపయోగించడం వల్ల చుండ్రు సమస్యను తగ్గించుకోవచ్చు. ఇది మీ జుట్టు నుండి చుండ్రును తొలగించడానికి పనిచేస్తుంది. మార్కెట్‌లో చుండ్రు నివారణ షాంపూలు చాలానే అందుబాటులో ఉన్నాయి. అయితే, డాక్టర్ సలహా తర్వాత ఈ షాంపూలను ఉపయోగించవచ్చు.

జుట్టుకు క్రమం తప్పకుండా నూనె రాయడం వల్ల జుట్టుకు పోషణ లభిస్తుంది. దీంతో చుండ్రు సమస్య తగ్గుతుంది. కొబ్బరి నూనె, ఆలివ్ ఆయిల్, బాదం నూనె వంటి నూనెలు జుట్టుకు మంచివి అని చెప్పవచ్చు. మీరు ప్రతి రాత్రి ఆలివ్ నూనెను పడుకునే ముందు తలకి అప్లై చేసుకోవచ్చు. కొబ్బరి నూనెను తలస్నానానికి అరగంట ముందు కొద్దిగా వేడి చేసి జుట్టుకు పట్టించాలి. దీంతో చుండ్రు సమస్య దూరం అవుతుంది.

జుట్టు క్లీన్ చేయడానికి వేడి నీటిని అస్సలు వాడకండి. ఎందుకంటే? వేడి నీరు జుట్టును పొడిగా, గరుకుగా మార్చుతుంది. ఇది చుండ్రు సమస్యను పెంచుతుంది. చాలా వేడి నీరు కూడా జుట్టు మూలాలను దెబ్బతీస్తుంది. అందువల్ల జుట్టు కడగడానికి గోరువెచ్చని నీటిని ఉపయోగించడం చాలా మంచిది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News