Wednesday, January 8, 2025

బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు: ఆరుగురు మృతి

- Advertisement -
- Advertisement -

చెన్నై: తమిళనాడు రాష్ట్రం విరుద్‌నగర్‌ జిల్లాలో శనివారం ఉదయం భారీ పేలుడు సంభవించింది. సాతూరులోని  బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించడంతో ఆరుగురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో ఏడుగురు తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. బాణసంచా పేలుడు ధాటికి కార్మికులు ఎగిరిపడ్డారు. సమీపంలోని 6 ఇళ్లు పూర్తిగా కాలిపోయాయి. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. రసాయనాలను కలుపుతుండగా ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News