Wednesday, January 8, 2025

మార్కెట్లో ఉన్న టాప్ 5 స్కూటర్లు..

- Advertisement -
- Advertisement -

మార్కెట్లో ద్విచక్ర వాహనాలకు ఉన్న డిమాండ్ గురుంచి చెప్పాల్సిన పని లేదు. ఇక నగరాల్లో అయితే అందరూ స్కూటర్లను నడపడానికి ఇష్ట పడుతారు. ఎందుకంటే పెట్రోల్ ఇంజన్, సౌకర్యవంతమైన సీటింగ్, మంచి మైలేజీ ఇవ్వటం. ఒకవేళ మీరు 125సీసీ సెగ్మెంట్లోని కొత్త స్కూటర్ ను కొనుగోలు చేయాలనుకుంటే ఈ వార్త మీ కోసమే. ఇప్పుడు మార్కెట్లో లభించే టాప్ 5 సరసమైన స్కూటర్ల గురుంచి తెలుసుకుందాం.

హోండా యాక్టివా 125

హోండా యాక్టివా స్కూటర్ సెగ్మెంట్లో అత్యంత ప్రజాదరణ పొందిన మోడళ్లలో ఒకటి. ఒకవేళ మీరు స్కూటర్‌లను కొనుగోలు చేయాలని అనుకుంటే హోండా యాక్టివా 125 బెస్ట్. ఈ స్కూటర్ లో 125సీసీ సింగిల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ కలదు. ఈ ఇంజన్ 8.19 బిహెచ్‌పి పవర్, 10.4 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. కాగా, హోండా దీనిని ఆరు వేరియంట్లలో 10 కలర్ ఆప్షన్లలో అందిస్తుంది.

సుజుకి యాక్సెస్ 125

బెస్ట్ స్కూటర్ కొనుగోలు చేయాలనుకుంటే సుజుకి యాక్సెస్ 125 చాలా ఉత్తమం. ఇందులో 124సీసీ సింగిల్ సిలిండర్ ఇంజన్ ఉంది. ఈ ఇంజన్ 8 బిహెచ్‌పి పవర్, 10.5 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. కాగా, ఈ స్కూటర్ నాలుగు వేరియంట్లు, 17 రంగు ఎంపికలు ఉన్నాయి.

యమహా ఫాసినో 125

యమహా వాహనాలను కొనుగోలు చేయడానికి ఆసక్తి ఉన్న కస్టమర్‌లు యమహా ఫాసినో 125 కొనొచ్చు. ఇందులో 125సీసీ సింగిల్ సిలిండర్ ఎయిర్-కూల్డ్ పెట్రోల్ ఇంజన్ కలదు. ఈ ఇంజన్ 8 బిహెచ్‌పి పవర్, 10.3 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. కంపెనీ ఎనిమిది వేరియంట్లలో, 23 కలర్ ఆప్షన్లలో కొనుగోలుదారులకు అందిస్తుంది.

హీరో డెస్టినీ ప్రైమ్

మార్కెట్లో లభించే అత్యంత సరసమైన 125సీసీ స్కూటర్ హీరో డెస్టినీ ప్రైమ్. డెస్టినీ ప్రైమ్ 124cc సింగిల్-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ను కలిగి ఉంది. ఇది 9 BHP శక్తిని, 10.36 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనిని ఒకే వేరియంట్, మూడు కలర్ ఆప్షన్లలో అందిస్తుంది.

హీరో డెస్టిని 125 Xtec

125 cc స్కూటర్ల జాబితాలో తదుపరి పేరు హీరో డెస్టిని 125 Xtec. ఇది హీరో డెస్టినీ ప్రైమ్ స్పోర్టియర్ వెర్షన్. ఇందులో 124సీసీ సింగిల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ ఉంది. ఈ ఇంజన్ 9 బిహెచ్‌పి పవర్, 10.34 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. కంపెనీ దీనిని కొనుగోలుదారులకు రెండు వేరియంట్లలో, ఏడు రంగుల ఎంపికలలో అందిస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News