Wednesday, January 8, 2025

మూడు చోట్ల ‘డాకు మహారాజ్‌’ ప్రీ రిలీజ్ వేడుకలు..

- Advertisement -
- Advertisement -

నందమూరి బాలకృష్ణ హీరోగా బాబి కలయికలో తెరకెక్కుతున్న చిత్రం డాకు మహారాజ్. ఈ మూవీ భారీ అంచనాలతో జనవరి 12న థియేటర్లో విడుదల కాబోతోంది. డాకు మహారాజ్ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగ వంశీ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తుండగా.. ప్రగ్యా, ఊర్వశి రౌతేలా, చాందిని చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో సినిమా ప్రమోషన్ పై మూవీ టీం దృష్టి పెట్టింది. అయితే, డాకు మహారాజ్ సినిమా రిలీజ్ వేడుకలు మూడు చోట్ల జరగనున్నాయి. ఈ క్రమంలో ఈనెల 5వ తేదీన డల్లాస్‌లో భారీ ఈవెంట్ నిర్వహించనున్నారు. అయితే ఈ వెంట్లో సినిమా ట్రైలర్ ను విడుదల చేయనున్నారు. అమెరిక నందమూరి ఫ్యాన్స్ ఆధ్వర్యంలో జరగబోతున్న ఈవెంట్లో మూవీ టీం సభ్యులు హాజరుకానున్నారు. మొదటిసారి అమెరికాలో ఈవెంట్ నిర్వహిస్తున్న నేపథ్యంలో ఫ్యాన్స్ భారీగా హాజరు కాబోతున్నారు. ఇది ఇలా ఉంటే.. తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు ఈవెంట్స్ కి సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ వారు ఏర్పాటు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మొదట హైదరాబాద్ లో జనవరి 7వ తేదీన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించబోతున్నారు. తర్వాత జనవరి 9వ తేదీన అనంతపూర్ జిల్లాలో మరో ఫ్రీ రిలీజ్ వేడుక ను అభిమానుల సమక్షంలో నిర్వహించబోతున్నారు. ఈ మేరకు మూవీ టీం శరవేగంగా ఏర్పాటు చేస్తోంది. ఇక సంక్రాంతి బరిలో ఈ మూవీ తో పాటు గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం మూవీస్ విడుదల కానున్న విషయం తెలిసిందే.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News