Wednesday, January 8, 2025

దేశం వదలి మూడేళ్లు వెళ్లేందుకు అవకాశం వచ్చింది..నిరాకరించాను

- Advertisement -
- Advertisement -

కారాగార శిక్ష అనుభవిస్తున్న పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మూడు సంవత్సరాల పాటు దేశం వీడి ప్రవాస జీవితం గడిపేందుకు తనకు అవకాశం వచ్చిందని, కానీ తాను నిరాకరించానని వెల్లడించారు. ‘నేను అటోక్ జైలులో ఉన్నప్పుడు మూడు సంవత్సరాల పాటు ప్రవాస జీవితం గడిపేందుకు నాకు అవకాశం ఇచ్చారు. కానీ నేను తుదిశ్వాస వరకు పాక్‌లోనే ఉంటాను’ అని మాజీ క్రికెటర్, రాజకీయ నాయకుడు 72 ఏళ్ల ఇమ్రాన్ ఖాన్ ‘ఎక్స్’ పోస్ట్‌లో తెలిపారు. 2023 ఆగస్టు నుంచి తాను నిర్బంధంలో ఉన్న రావల్పిండి అడియాలా జైలులో మీడియా సిబ్బందితో ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ, ఇస్లామాబాద్‌లోని తన బని గాలా నివాసానికి తన బదలీకి ఒక ఆఫర్‌తో తనను ‘పరోక్షంగా సంప్రదించార’ని తెలిపారు.

కానీ తాను ఆ ఆఫర్‌ను తిరస్కరించినట్లు ఆయన చెప్పారు. ‘నా వైఖరి సుస్పష్టం : నిర్బంధంలో ఉన్న మా కార్యకర్తలను, నాయకులను ముందు విడుదల చేయాలి. ఆ తరువాతే నా వ్యక్తిగత పరిస్థితిపై చర్చించే విషయం పరిశీలిస్తాను’ అని ఇమ్రాన్ తెలియజేశారు. పాకిస్తాన్ నిర్ణయాలను దేశంలోనే తీసుకోవాలనేది తన అభిప్రాయమని పాకిస్తాన్ తెహ్రీక్ ఎ ఇన్సాఫ్ (పిటిఐ) వ్యవస్థాపకుడు ఇమ్రాన్ తెలిపారు. ‘అయితే, మానవహక్కుల సంగతి వస్తే ప్రపంచవ్యాప్తంగా గొంతులు వినిపిస్తాయి. ఐక్యరాజ్య సమితి (యుఎన్) వంటి సంస్థలు ఇందుకే ఉన్నాయి. మౌలిక హక్కుల ఉల్లంఘనకు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా మేధావులు నిరసనలు వ్యక్తం చేశారు’ అని ఇమ్రాన్ తెలిపారు,

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News