Wednesday, January 8, 2025

పోలవరం ముంపుపై అధ్యయనం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ ఐఐటి బృందంతో నివేదిక
రూపొందించాలని అధికారులకు సిఎం ఆదేశం
నెలరోజుల్లో పూర్తి చేయాలని సూచన
ఆంధ్రప్రదేశ్ నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టు
బనకచర్లపై అవసరమైతే గోదావరి బోర్డుకు,
కేంద్ర జలశక్తికి లేఖ రాయాలని ఆదేశం

మన తెలంగాణ/హైదరాబాద్ : ఎపిలో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టుతో తెలంగాణపై పడే ప్రభావంపై అధ్యయనం చేయాలని సిఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశిం చారు. ఈ మేరకు ఐఐటీ హైదరాబాద్ బృందంతో నివేదిక తయారు చేయించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. నెల రోజుల్లో సమగ్ర నివేదిక తయారు చేయాలని సిఎం స్ప ష్టం చేశారు. శనివారం ఇరిగేషన్ అధికారులతో ముఖ్యమంత్రి రేవం త్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఐఐటీ హైదరాబాద్ టీంలతో సమన్వయం కోసం ప్రత్యేక అధికారిని నియమించాలని ముఖ్యమంత్రి సూచించారు. 2022లో 27 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చినప్పుడు భద్రాచలం ముంపునకు గురైనట్లు సిఎం రేవంత్‌కు నీటిపారుదలశాఖ అధికారులు వివరించారు. ఈ మేరకు పోలవరం నిర్మాణం తో భద్రాచలం దేవాలయానికి ఏర్పడే ముప్పుపై అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా చేపట్టిన గోదావరి బనకచర్ల ప్రాజెక్టు అంశాన్ని కూడా అధికారులు సిఎం దృష్టికి తీసుకొచ్చారు. ఈ ప్రాజెక్టుపై ఇటీవల ఎపి ప్రభు త్వం పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ఇచ్చిందని అధికారులు తెలిపా రు.

వరద జలాల ఆధారంగా నిర్మిస్తున్న బనకచర్ల ప్రాజెక్టుకు ఎలాం టి అనుమతులు లేవని సిఎం రేవంత్‌రెడ్డి దృష్టికి అధికారులు తీసుకెళ్లారు. బనకచర్లపై ప్రాజెక్టుపై ఎపి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి తెలంగాణ అభ్యంతరాలను తెలపాలని
అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం అవసరమైతే గోదావరి రివర్ మేనేజ్‌మెంట్బో ర్డుతో పాటు కేంద్ర జల్ శక్తి మంత్రిత్వ శాఖకు లేఖలు రాయాలని ముఖ్యమంత్రి రేవంత్ ఆదేశించారు. సమావేశంలో నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ నీటి పారుదల శాఖ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్ పాల్గొన్నారు. ఎపిలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబు పోలవరం, అమరావతి నిర్మాణ పనులపై దృష్టి పెట్టారు. ఈ మేరకు ఆగస్టు 2024లో పోలవరం, అమరావతి నిర్మాణ పనులు వేగంగా సాగేందుకు సహకారం అందించాలని ప్రధాని మోడీని చంద్రబాబు కోరారు. ఈ నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టుతో తెలంగాణపై పడే ప్రభావంపై అధ్యయనం చేయాలని సిఎం రేవంత్ అధికారులను ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News