Wednesday, January 8, 2025

చెరిపితే చెరిగేది కాదు చరిత్ర: కెసిఆర్

- Advertisement -
- Advertisement -

తెలంగాణ అస్తిత్వ ప్రతీకగా ప్రజల హృదయాలలో స్వచ్ఛందంగా ప్రతిష్ఠించుకున్న తెలంగాణ తల్లి రూపాన్ని ఎవ్వరూ చెరిపేయలేరని తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. తెలంగాణ తల్లి రూపాన్ని స్వరాష్ట్ర ఉద్యమంలోనే రూపొందించబడిందని ఆయన చెప్పారు. ఎర్రవల్లి లోని కేసీఆర్ నివాసంలో శనివారం సాయంత్రం తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ సంపాదకత్వంలో వెలువరించిన ‘అందరికీ అమ్మ’ అన్న పుస్తకాన్ని కేసీఆర్ ఆవిష్కరించారు. తెలంగాణ తల్లి రూపాన్ని గుండెల్లో దాచుకుని స్వరాష్ట్ర ఉద్యమం మహోగ్రంగా సాగిందన్నారు. తెలంగాణ తల్లి రూపం రాష్ట్ర సాధన ఉద్యమ ప్రతి అడుగులో, ప్రతి మలుపులో దారిచూపిన తల్లి రూపంగా నిలిచిందన్నారు.

స్వరాష్ట్రంలో కూడా సాంస్కృతిక ఉద్యమం నిరంతరంగా కొనసాగుతుందని తెలిపారు. తెలంగాణ తల్లులు ఎత్తిన బోనాలలో, బతుకమ్మలలో కోట్లాది మంది తల్లులు పాల్గొన్న వంటావార్పుల్లో సబ్బండ వర్ణాలు చేసిన ఉద్యమాల్లో గడప గడపకు తెలంగాణ తల్లి భావోద్వేగ రూపం ప్రతిష్ఠించబడిందని కేసీఆర్ చెప్పారు. చరిత్రను ఎవ్వరు చెరిపేయలేరని, చరిత్ర చెరిపితే చెరిగేది కాదని, చరిత్రే పాఠం చెబుతుందన్నారు. ఈ పుస్తకావిష్కరణలో తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్, మాజీ మంత్రులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు భూపాల్ రెడ్డి, ఉపేందర్ రెడ్డి, సునీత, శాసనమండలి సభ్యులు తాతామధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News