Wednesday, January 8, 2025

పంచాయతీరాజ్ శాఖలో కారుణ్య నియామకాలకు మోక్షం

- Advertisement -
- Advertisement -

పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖలో ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న కారుణ్య నియామకాలకు రాష్ట్ర మంత్రివర్గం శనివారం నాడు ఆమోదం తెలిపింది. మొత్తం 588 కారుణ్య నియామకాలకు క్యాబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఈ శాఖలో పనిచేస్తున్న 588 మంది సిబ్బంది అనారోగ్య, ఇతర సమస్యలతో మరణించారు. వారి మరణంతో కుటుంబం ఇబ్బందులు కావొద్దని మానవతా దృక్పథంతో కారుణ్య నియామకాలు చేపడతారు. ఈ శాఖలో ఎంతోకాలంగా కారుణ్య అమ్మకాలు పెండింగ్‌లో ఉన్నాయి. గత ప్రభుత్వం కాలనీ నియామకాలపై నిర్లక్ష్యం చూపింది. ఆశావాహులు సీఎం సీతక్కను కలిసి కారుణ్య నియామకాల ప్రక్రియ పూర్తి చేయాలని గతంలో విజ్ఞప్తి చేశారు.

వారి పరిస్థితిని అర్థం చేసుకున్న సీతక్క పెద్ద మనసుతో సీఎం రేవంత్‌రెడ్డిని, ఆర్థిక శాఖ అధికారులను ఒప్పించి కారుణ్య నియామకాలకు ఎలాంటి అడ్డంకులు లేకుండా కృషి చేశారు. కారుణ్య నియామకాలకు ఆటoకంగా వున్న సాంకేతిక న్యాయపరమైన చిక్కుముళ్లను అధిగమించేలా ప్రత్యేకంగా చర్యలు తీసుకున్నారు. దీంతో ఎట్టకేలకు పంచాయతీరాజ్ శాఖలో కారుణ్య నియామకాలకు మోక్షం దక్కింది. పట్టుబట్టి కారుణ్య నియామకాలు సాధించిపెట్టిన మంత్రి సీతక్కకు ఈ సందర్భంగా కారుణ్య నియామకాల్లో చేరబోతున్న అభ్యర్థులు కృతజ్ఞతలు తెలిపారు. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న తమ సమస్యకు పరిష్కారం చూపిన ప్రజా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.

ఇక ములుగు మున్సిపాలిటీ
ములుగు ప్రజల సుదీర్ఘ స్వప్నం ఫలించింది. నూతన మున్సిపాలిటీగా ములుగు అవతరించబోతోంది. ఇప్పటివరకు గ్రామపంచాయతీగా ఉన్న ములుగును మున్సిపాలిటీగా మారుస్తూ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. రెండు మూడు రోజుల్లో అధికారిక ప్రక్రియ పూర్తి కాగానే ములుగు మునిసిపాలిటీ గా అవతరించనుందని మంత్రి సీతక్క తెలిపారు. సెప్టెంబర్ 2022లోనే తెలంగాణ అసెంబ్లీ ములుగును మునిసిపాలిటీ చేస్తూ అసెంబ్లీలో బిల్లును ఆమోదించినా, బిల్లు సరిగా లేకపోవడం, తదితర కారణాలతో గవర్నర్ ఆమోదం తెలపలేదు. అప్పటి ప్రభుత్వం ములుగును మున్సిపాలిటీగా ఏర్పాటు చేసేందుకు చిత్తశుద్ధిగా పనిచేయలేదు.

దీంతో గత రెండు సంవత్సరాలుగా ఈ అంశం పెండింగ్ లోనే ఉండిపోయింది. కెసిఆర్ ప్రభుత్వం నిర్వాకం వల్ల జిల్లా కేంద్రంగా ములుగు అవతరించినా మున్సిపాలిటీకి నోచుకోలేదు. రాష్ట్ర గవర్నర్ ను, రాష్ట్రపతిని కలిసి బిల్లుకు ఆమోదం తెలపాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. అయితే గత ప్రభుత్వం పాస్ చేసిన బిల్లులో పలు లోపాలు ఉండటంతో గవర్నర్ ఆమోదం తెలపలేదు. దీంతో మరోసారి ములుగును మున్సిపాలిటీగా ఏర్పాటు చేస్తూ, పాత బిల్లును రీ కాల్ చేస్తూ క్యాబినెట్ శనివారం నాడు ఆమోదం తెలపడంతో ములుగు మున్సిపాలిటీకి మార్గం సుగుమయ్యింది. కాగా ములుగు మున్సిపాలిటీ కల సాకారానికి కృషి చేసిన మంత్రి సీతక్కకు స్థానిక ప్రజలు ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News