Wednesday, January 8, 2025

రైతన్నను దగా చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

రైతుబంధు కింద ఇచ్చే పెట్టుబడి సహాయాన్ని పెంచుతామని, రైతు భరోసా కింద ఏటా ఎకరానికి 15000 ఇస్తామని ఆశలు పెట్టి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక దగా చేసిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు దుయ్యబట్టారు. ఎన్నికల సభలో రేవంత్ రెడ్డి, ఇప్పుడైతే 10000, మాకు ఓటేస్తే 15000 అని ఊరించించి నమ్మించి ఓట్లు కొల్లగొట్టి గద్దెనెక్కారని విమర్శించారు. క్యాబినెట్‌లో తీసుకున్న నిర్ణయం ద్వారా రైతుల ఆశలను అడియాసలు చేసిందని. రైతు భరోసాను రైతు గుండె కోతగా మార్చారని విమర్శించారు. రైతు భరోసా కింద ఎకరానికి ప్రతి సీజన్లో 7,500 చొప్పున ఇస్తామని చెప్పి, 6000 కు కుదించారని, కాంగ్రెస్ మోసపూరిత వైఖరికి ఇది పరాకాష్ట, మోసానికి పర్యాయపదం రేవంత్ రెడ్డి అని హరీశ్‌రావు ధ్వజమెత్తారు. కేసీఆర్ మానస పుత్రిక, ప్రపంచమే మెచ్చిన రైతుబంధు స్ఫూర్తికి వ్యతిరేకంగా క్యాబినెట్ నిర్ణయాలు తీసుకుందని విమర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News