Wednesday, January 8, 2025

రేవంత్.. కటింగ్ మాస్టర్

- Advertisement -
- Advertisement -

రైతుభరోసాపై ఆంక్షలు..లబ్ధిదారుల సంఖ్య కుదింపునకు
యత్నాలు రూ.2లక్షల రుణమాఫీ పూర్తిగా ఎక్కడా జరగలేదు
ఏ గ్రామానికి వెళ్లినా..ఈ వాస్తవం బయటపడుతుంది ఆరు
గ్యారంటీల్లో అరగ్యారంటీయే అమలు సిరిసిల్ల కార్యకర్తల
సమావేశంలో బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్

మన తెలంగాణ/సిరిసిల్ల ప్రతినిధి : సిఎం రేవంత్‌రెడ్డి ఆయా పథకాల లబ్ధిదారుల సంఖ్యపై కోతలు పెడు తూ కటింగ్ మాస్టర్‌లా మారారని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ విమర్శించారు. అన్నదాత ప్రమా ణ పత్రం ఇస్తేనే రైతుబంధు నిధులు వేస్తానని రేవంత్‌రెడ్డి అంటున్నారని, ఇంతకన్నా దారుణం ఏముందని ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగులకు రైతుబంధు లేదని కోతలు పెడుతున్నారని విమర్శించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల్లో ఆరు గ్యారంటీల అమలు అని చెప్పి, 400 రో జులైనా అర గ్యారంటీ.. అదీ ఫ్రీ బస్ తప్ప మరేమీ అమలు కాలేదని బిఆర్‌ఎస్ వర్కిం గ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎంఎల్‌ఏ కెటిఆర్ ఎద్దేవా చేశారు. సిరిసిల్లలో శనివారం పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆరు గ్యారంటీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తే తనపై ఆరు కేసులు పెట్టాలని కాంగ్రెస్ చూస్తోందని ఆరోపించారు. గడిచిన 13 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైందని అన్నారు. రెండు లక్షల రూపాయల రుణమాఫీ అమలు కాలేదన్నారు. కాంగ్రెస్ నేతలకు పరిపాలన చేతకావడం లేదన్నారు. వరంగల్‌లో రైతు డిక్లరేషన్ ప్రకటించిన కాంగ్రెస్ ఇప్పుడు రైతులనే పంటలు పండించినట్లు డిక్లరేషన్ అడుగుతున్నారని మండిపడ్డారు. అసెంబ్లీలో రైతుబంధులో రూ.22 వేల కోట్లు దారిమళ్లాయని తప్పుడు ప్రకటన చేశారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై బద్‌నామ్ చేశారని, 3 నెలల్లో మేడిగడ్డను రిపేర్ చేసే అవకాశాలున్నా చేయలేదన్నారు. భూకంపం వచ్చినా వరదలు వచ్చినా కాళేశ్వరం తట్టుకుందన్నారు. ఢిల్లీ కాంగ్రెస్‌కు తెలంగాణ కాంగ్రెస్ ఏటిఎంగా మారిందన్నారు. వేల కోట్లు ఢిల్లీకి పంపారన్నారు.

కొత్త సంవత్సరంలో పార్టీ బలోపేతానికి పార్టీ సంస్థాగత ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలనుకునేవారు ప్రజల పక్షాన నిలబడి పనులు చేయాలని, కేసులకు భయపడవద్దని అన్నారు. రైతుల పక్షాన గులాబీ దండు నిలబడాలన్నారు. కెసిఆర్ హయాంలో రైతుబంధును 12 దఫాలుగా రూ.80 వేల కోట్లు రైతుల ఖాతాల్లో వేశారన్నారు. రుణమాఫీ కింద రూ.47 వేల కోట్లు 70 లక్షల మంది రైతులకు ఇచ్చారన్నారు. మరోసారి సిఎంగా కెసిఆర్‌ను చూడాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. త్వరలోనే బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పాటు తథ్యమన్నారు. సిరిసిల్లలో లీగల్ సెల్ ఏర్పాటుకు కృషి జరుగుతోందని అన్నారు. తమ పార్టీ కార్యకర్తలను వేధించినవారి వివరాలు తమ దగ్గర ఉన్నాయని, తాము అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతీకారం తప్పక తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపి బోయినిపల్లి వినోద్‌కుమార్, పార్టీ నాయకులు కొండూరి రవీందర్ రావు, కొప్పుల ఈశ్వర్, తోట ఆగయ్య, జిందం కళచక్రపాణి, జిందం చక్రపాణి, దిడ్డి రాజు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News