Wednesday, January 8, 2025

ఎందుకీ మౌనం? ఏమిటి దీని భావం?

- Advertisement -
- Advertisement -

కెసిఆర్ ఆరోగ్యం బాగుపడింది. కవిత జైలు నుంచి వచ్చారు. అయినా ఆయన ఇంకా బయటికి రావడంలేదు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో పెద్దలు ఎన్నిసార్లు ఎన్ని విధాలుగా కవ్వించినా ఆయననుండి ఎటువంటి స్పందనా లేదు. ‘కెసిఆర్ సభకు వస్తే ఏ విషయంమీదనైనా చర్చకు మేము సిద్ధం, ఎన్నిరోజులైనా శాసనసభ సమావేశాలు నిర్వహించడానికి వెనుకాడం’ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా సవాల్ చేశారు. అయినా కేసీఆర్ నుంచి ఎటువంటి స్పందనా లేదు.

వయసులో తనకంటే చిన్నవాడు ముఖ్యమంత్రి అయ్యాడనో, తనకు గిట్టనివాడు ముఖ్యమంత్రి అయ్యాడనో శాసనసభ ముఖం చూడని నాయకులు చాలా తక్కువమంది ఉంటారు. చంద్రశేఖరరావు ఆ కారణం చేతనే శాసనసభకు రావడం లేదు అనుకోవాలా ? శాసనసభకు రాకపోతే పోయే, కనీసం ప్రజాక్షేత్రంలో కొచ్చి సమస్యల మీద పోరాటం చేయాలి కదా. అది కూడా తన తర్వాత శ్రేణి నాయకులకు అప్పగించి ఆయన ఎందుకు మౌనంగా కూర్చున్నట్టు?

ఏప్రిల్ 27న వరంగల్లులో జరుగుతుందని చెప్తున్న పార్టీ ఆవిర్భావ సభలో కెసిఆర్ ఎటువంటి నిర్ణయాన్ని ప్రకటించబోతున్నారనే విషయం మీద చర్చ జరుగుతున్నది. ఈ సంవత్సర కాలం ఆయన బయటకు రాకుండా ఫామ్ హౌస్‌లో 2023 ఎన్నికల ఓటమికి సంబంధించిన సమీక్షలు జరిపి దిద్దుబాటు చర్యలకు సంబంధించిన ప్రణాళికలు రూపొందించి వాటిని ఏప్రిల్ నుంచి అమలు చేయడానికి బయటకు వస్తారా? భారత రాష్ట్ర సమితిలో నెలకొన్న ప్రస్తుత పరిణామాలు అలాంటి అభిప్రాయం అయితే కలిగించడం లేదు.

కెసిఆర్ ఆరోగ్యం బాగుపడింది. కవిత జైలు నుంచి వచ్చారు. అయినా ఆయన ఇంకా బయటికి రావడంలేదు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో పెద్దలు ఎన్నిసార్లు ఎన్ని విధాలుగా కవ్వించినా ఆయననుండి ఎటువంటి స్పందనా లేదు. ‘కెసిఆర్ సభకు వస్తే ఏ విషయంమీదనైనా చర్చకు మేము సిద్ధం, ఎన్నిరోజులైనా శాసనసభ సమావేశాలు నిర్వహించడానికి వెనుకాడం’ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా సవాల్ చేశారు. అయినా కెసిఆర్ నుంచి ఎటువంటి స్పందనా లేదు.

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు జనంలోకి ఎప్పుడు వస్తారు? 2023వ సంవత్సరం నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి ఓడిపోయిన తర్వాత నుంచి ఆయన తన గజ్వేల్ నియోజకవర్గంలోని ఎర్రవెల్లి ఫామ్ హౌస్‌లోనే ఉంటున్నారు. సంవత్సరం గడిచిపోయినా ఇప్పటివరకు ఆయన శాసనసభలోకి అడుగుపెట్టలేదు. శాసనసభ్యుడిగా శాసనసభ స్పీకర్ ఛాంబర్‌లో ప్రమాణ స్వీకారం చేశారు. చిన్న ప్రమాదం కారణంగా కొద్ది మాసాలపాటు విశ్రాంతిలో ఉన్నప్పటికీ ఆయన ఫామ్ హౌస్ నుంచే రాజకీయాలు చేస్తూ ఉన్నారు. కొద్ది రోజులు ఓటమి భారం, ఆ తర్వాత ప్రమాదంలో గాయపడి విశ్రాంతి, ఆ వెనువెంటనే కూతురు కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కొన్ని మాసాలపాటు జైలుకు వెళ్లడం.. వీటితోటే మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుకి సంవత్సర కాలం గడిచిపోయింది.

ఆయన ఆరోగ్యం బాగుపడింది. కవిత జైలు నుంచి వచ్చారు. అయినా ఆయన ఇంకా బయటికి రావడంలేదు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో పెద్దలు ఎన్నిసార్లు ఎన్ని విధాలుగా కవ్వించినా ఆయననుండి ఎటువంటి స్పందనా లేదు. ‘కెసిఆర్ సభకు వస్తే ఏ విషయం మీదనైనా చర్చకు మేము సిద్ధం, ఎన్నిరోజులైనా శాసనసభ సమావేశాలు నిర్వహించడానికి వెనుకాడం’ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా సవాల్ చేశారు. అయినా కెసిఆర్ నుంచి ఎటువంటి స్పందనా లేదు. నిన్ననే పిసిసి అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ కూడా ఒక మాట అన్నారు. శాసనసభకు రాని వ్యక్తికి ప్రతిపక్ష నాయకుడి హోదా ఎందుకు? అని. ఇంతకూ కెసిఆర్ ఎప్పుడు బయటికి వస్తారు? ఇప్పుడు దీనిమీదనే చర్చ జరుగుతోంది రాజకీయ వర్గాల్లో. ఆయన బయటికి రాకపోవడం గురించి భారత రాష్ట్ర సమితి కార్యాధ్యక్షుడు, మాజీ మంత్రి కెటి రామారావు పత్రికల వారితో మాట్లాడుతూ ‘ఓడిపోతే రెస్ట్ తీసుకుంటానన్న కెసిఆర్ అదే పని చేస్తున్నారు ఇప్పుడు. సరైన సమయంలో ఆయన బయటకు వస్తార’ని చెప్పారు. ఆ సరైన సమయం ఎప్పుడు వస్తుందా అని భారత రాష్ట్ర సమితి రెండవ శ్రేణి నాయకులు, కార్యకర్తలు, కెసిఆర్ అభిమానులకంటే ఎక్కువగా ప్రత్యర్థి రాజకీయ వర్గాలే ఎదురు చూస్తున్నట్లుగా ఉంది.

ఈ సంవత్సరం ఏప్రిల్ నెలలో జరిగే పార్టీ సభల గురించి కెటి రామారావు ఇటీవల ప్రస్తావించారు. ఏప్రిల్ 27న తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ సభను వరంగల్‌లో ఘనంగా నిర్వహించనున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో కెసిఆర్ పునరాగమనం గురించిన ఊహాగానాలు పెద్ద ఎత్తున చెలరేగుతున్నాయి. కెసిఆర్ బయటకు రావడమా, రాకపోవడమా, వస్తే ఎప్పుడు రావడం, ఏ విధంగా రావడం, ఆయన రాజకీయ వ్యూహాలు ఏమిటి అనేది పూర్తిగా ఆ పార్టీకి సంబంధించిన వ్యవహారమే అయినా దాని మీద చర్చ జరగడాన్ని ఎవరూ ఆపలేరు కదా. 1970లలో సిద్దిపేటలో యువజన కాంగ్రెస్ నాయకుడిగా జీవితం ప్రారంభించి, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలోకి దూకి 2014 లో రాష్ట్రాన్ని సాధించుకునే వరకు ఆయన రాజకీయాల్లో చురుకైన పాత్ర నిర్వహించడం కూడా కెసిఆర్ సంవత్సర కాలంగా రాజకీయాలకు ఎందుకు దూరంగా ఉన్నారని చర్చించుకునేందుకు ఆ స్కారం కల్పించింది. ఇంతకూ కెసిఆర్ సంవత్సరకాలంగా బయటకు రాకపోవడానికి కారణం ఏమిటి? ముఖ్యమంత్రిగా ఉంటే తప్ప శాసనసభకు వెళ్లరా? సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన కెసిఆర్ ఇలా ఎలా ఆలోచిస్తారు?
ఎన్నికల్లో గెలుపు ఓటములు సర్వసాధారణంగా జరిగేవి.

ప్రజా తీర్పును మన్నించి ప్రతిపక్షంలోకి వచ్చినవాళ్లు మళ్లీ ఐదు సంవత్సరాలు కష్టపడి ప్రజల మన్నన పొంది తిరిగి అధికారంలోకి రావడానికి పని చేస్తారు. ఇలా అధికారం కోల్పోయిన సీనియర్ రాజకీయ నాయకులు అనేక మంది ప్రతిపక్షంలో ఉండి పని చేయడం, నిర్మాణాత్మక సలహాలు ఇవ్వడం, ప్రభుత్వం సరిగ్గా నడుస్తున్నదీ లేనిదీ గమనించడం, తప్పులు జరిగితే నిలదీయడం, పోరాటాలు చెయ్య డం అనేది అనేక సందర్భాల్లో జరుగుతూ వచ్చేదే. వయసులో తనకంటే చిన్నవాడు ముఖ్యమంత్రి అయ్యారనో, తనకు గిట్టనివాడు ముఖ్యమంత్రి అయ్యారనో శాసనసభ ముఖం చూడని నాయకులు చాలా తక్కువ మంది ఉంటారు. చంద్రశేఖరరావు ఆ కారణం చేతనే రావడం లేదు అనుకోవాలా శాసనసభకు? శాసనసభకు రాకపోతే పోయే, కనీసం ప్రజాక్షేత్రంలోకొచ్చి సమస్యల మీద పోరాటం చేయాలి కదా. అది కూడా తన తర్వాత శ్రేణి నాయకులకు అప్పగించి ఆయన ఎందుకు మౌనంగా కూర్చున్నట్టు?

ఇక్కడ ఒక ఉదంతం గుర్తొస్తోంది. 1980 ద శకంలో ఈశాన్య రాష్ట్రమైన అసోంలో విద్యార్థులు పెద్ద ఎత్తున ఉద్యమించారు. ఆల్ అ స్సాం స్టూడెంట్స్ యూనియన్ (ఆసు)కు నాయకత్వం వహించిన యువకుడు ప్రఫుల్ల కుమార్ మహంత ఆ వెంటనే జరిగిన ఎన్నికల్లో గెలిచి అస్సామ్ గణపరిషత్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి అయినప్పుడు, అంతకుముం దు ముఖ్యమంత్రిగా ఉన్న కాంగ్రెస్ సీనియర్ నాయకుడు హితేశ్వర సైకియా ప్రతిపక్షంలో కూర్చున్నారు. తర్వాత మళ్ళీ ప్రఫుల్లని ఓడించి ఆయన ముఖ్యమంత్రి అయ్యారు మరోసారి. తొలిసారి ముఖ్యమంత్రి అయ్యేనాటికి ప్రఫుల్ల కుమార్ మహంతకు రాజకీయాలతో అసలు సంబంధమే లేదు. విశ్వవిద్యాల యం నుంచి నేరుగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించాడు. హితేశ్వర్ సైకియా కంటే వయసులో కూడా ప్రఫుల్ల చాలా చిన్నవాడు. మరి ఆనాడు హితేశ్వర్ సైకియా తనకంటే ఇంత చిన్నవాడు తనను ఓడించి ముఖ్యమంత్రి అయ్యారని చెప్పి శాసనసభకు పోకుండా ఉన్నాడా? ఇలాంటి ఉదాహరణలు మనకు అనేకం కనిపిస్తాయి. ఇవేవీ చంద్రశేఖరరావు గారిని శాసనసభకు తీసుకువచ్చేందుకు ఉపయోగపడలేదు.

ప్రస్తుత శాసనసభలో తన స్థాయి నాయకులెవరూ లేరు కాబట్టి రాకూడదు అనుకుంటున్నారేమో తెలియదు. ఆయన అలా అనుకుంటూ ఉంటే మాత్రం పొరపాటు చేస్తున్నారు. భారత రాష్ట్ర సమితిగా రూపాంతరం చెందిన తెలంగాణ రాష్ట్ర సమితిలో ఇతర నాయకులు ఎంతమంది ఉన్నా ప్రత్యక్ష రాజకీయాల్లో ఆయన లేకుండా పోవడంవల్ల జరిగే నష్టాన్ని నివారించలేరు. భారత రాష్ట్ర సమితి మళ్లీ అధికారంలోకి వస్తుందా రాదా అనే విషయం పక్కనపెడితే చంద్రశేఖరరావు ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండటంవల్ల అసలుకే మోసం వస్తుందేమో!ఏప్రిల్ 27న వరంగల్‌లో జరుగుతుందని చెప్తున్న పార్టీ ఆవిర్భావ సభలో కెసిఆర్ ఎటువంటి నిర్ణయాన్ని ప్రకటించబోతున్నారనే విషయం మీద చర్చ జరుగుతున్నది. ఈ సంవత్సర కాలం ఆయన బయటకు రాకుండా ఫామ్ హౌస్‌లో 2023 ఎన్నికల ఓటమికి సంబంధించిన సమీక్షలు జరిపి దిద్దుబాటు చర్యలకు సంబంధించిన ప్రణాళికలు రూపొందించి వాటిని ఏప్రిల్ నుంచి అమలు చేయడానికి బయటకు వస్తారా? భారత రాష్ట్ర సమితిలో నెలకొన్న ప్రస్తుత పరిణామాలు అలాంటి అభిప్రాయం అయితే కలిగించడం లేదు.

ఈ సంవత్సర కాలం పార్టీ కార్యాధ్యక్షుడిగా రాజకీయ వ్యవహారాలన్నీ చక్కబెడుతున్న కెటి రామారావు ఫార్ములా ఈ- కార్ రేసుల వ్యవహారంలో ఎసిబి, ఇడి విచారణని ఎదుర్కోబోతున్న సమయంలోనే ఆయన సోదరి కవిత బిపి కార్డు చేత పట్టుకుని బయటకు రావడం చర్చనీయాంశమైంది. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కొద్ది మాసాలపాటు జుడీషియల్ రిమాండులో తీహారు జైల్లో ఉండి వచ్చిన కవిత నిన్నమొన్నటిదాకా చాలా మౌనంగా ఉన్నారు. ఉద్యమకాలంలో ఆమె ప్రారంభించిన తెలంగాణ జాగృతి కార్యకలాపాలు దాదాపుగా మూతపడ్డాయి. కవిత ఇక రాజకీయాలనుంచి విరమించుకుంటారు అనే ఒక అభిప్రాయం అందరిలో కలుగుతున్న తరుణంలో ఆమె ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన డిజిగ్నేటెడ్ కమిషన్‌కు ఒక మెమొరాండం ఇవ్వడం ద్వారా మళ్లీ తెర మీదికి వచ్చారు. స్థానిక సంస్థల్లో వెనుకబడిన తరగతుల రిజర్వేషన్ల విషయం నిర్ధారించడం కోసం రాష్ట్రప్రభుత్వం డెజిగ్నేటెడ్ కమిషన్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

కవిత బయటకు వచ్చిననాటికి ఇంకా కెటిఆర్ మీద ఎసిబి కేసు పెట్టలేదు. మంత్రివర్గ నిర్ణయం లేకుండా ఒక విదేశీ సంస్థకు కోట్లాది రూపాయలు చెల్లించారన్న విషయంలో కేసు పెట్టబోతున్నారనే వార్త మాత్రం బయటకు వచ్చింది. ప్రస్తుతం ఈ కేసును కొట్టివేయాలని చెప్పి కెటి రామారావు కోర్టుకు వెళ్లడం, కోర్టు ఇప్పుడే ఆయనను అరెస్ట్ చేయవద్దని ఎసిబికి ఆదేశాలు జారీ చేయడం తెలిసిందే. ఈ కేసులో కెటి రామారావు అరెస్ట్ కాక తప్పదు, జైలుకుపోక తప్పదు కాబట్టి ప్రత్యామ్నాయంగా కెసిఆరే కవితను బయటికి తీసుకొచ్చారు అని కూడా చెప్పుకుంటున్నారు.
బయటకు వస్తూనే బిసి రిజర్వేషన్ల అంశం తీసుకుని కవిత ముందుకు పోవడానికి ఇంకో కారణం కూడా ఉండొచ్చు. 2014లో రాష్ట్రం ఏర్పడి అధికారంలోకి వచ్చిన దగ్గర నుండీ భారత రాష్ట్ర సమితి రైతులకే ప్రాధాన్యత ఇచ్చిన విషయం తెలిసిందే. అధికారంలో ఉన్న తొమ్మిదిన్నర సంవత్సరాల కాలంలో పదకొండు దశల్లో 70 లక్షల మంది రైతులకు 73 వేల కోట్ల రూపాయలు రైతుబంధు పథకం కింద సాయం అందించినా పరాజయం తప్పకపోవడంతో ఇప్పుడు వెనుకబడిన తరగతుల రిజర్వేషన్ అంశాన్ని ఎత్తుకోవాలని ఆ పార్టీ ఆలోచిస్తున్నట్టు అర్ధం అవుతున్నది. రైతులు ఎక్కువ సంఖ్యలో ఉన్న గ్రామీణ తెలంగాణాలోనే భారత రాష్ట్ర సమితికి గత సంవత్సరం జరిగిన ఎన్నికల్లో ఎక్కువ నష్టం జరిగిన విషయం తెలిసిందే.

ఈలోగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వేలో తెలంగాణ జనాభాలో 55 శాతం బిసిలే అన్న లెక్కలు తేలడం, స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసిల రిజర్వేషన్ల శాతం నిర్ణయించడానికి ప్రభుత్వం డిజిగ్నేటెడ్ కమిషన్‌ను నియమించడం, ఆ కమిటీ కూడా రేపో మాపో తన నివేదిక సమర్పించనుండటం కూడా బిఆర్‌ఎస్ బిసి అంశాన్ని తీసుకుని ముందుకు పోవాలనుకోవడానికి కారణం కావచ్చు. అధికారంలో ఉన్నంత కాలం బిసిలను బిఆర్‌ఎస్ పట్టించుకోలేదని, ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చాక కూడా నాయకత్వం ఒకే కుటుంబం చేతుల్లో ఉన్నదనే విమర్శలు అధికారపక్షం నుండి ఎదుర్కోవాల్సి రావడం కూడా మరో కారణం కావచ్చు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విలేఖరులతో మాట్లాడుతూ బిసిల మీద అంత ప్రేమ ఉంటే బిఆర్‌ఎస్ మూడు ప్రధాన పదవుల్లో (పార్టీ అధ్యక్షుడు, కార్యాధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు) ఒకటి బిసిలకు ఇవ్వొచ్చు కదా అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బిసిల రిజర్వేషన్లను ఖరారు చేసి వచ్చే నెల ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికలకు పోవచ్చునన్న వార్త వినిపిస్తున్నది. మరి కవిత ప్రస్తుతం ఎత్తుకున్న బిసి జెండా బిఆర్‌ఎస్‌కు స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్ఫలితాలను ఇస్తుందో లేదో చూడాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News