Thursday, January 9, 2025

మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దేందుకే ‘ఇందిరా మహిళా శక్తి’

- Advertisement -
- Advertisement -

మహిళలను కోటిశ్వరులుగా తీర్చిదిద్దేందుకే తమ ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం చేపట్టిందని పంచాయతీరాజ్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది, మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క వెల్లడించారు. సోమవారం ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించి పలు అభివృద్ధి పనులకు ఆమె శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… మహిళా సమాఖ్య సభ్యులు మంచిగా పనిచేసి అభివృద్ధి పథంలో ముందుకు వెళ్లాలని హితవు పలికారు. ఈ సందర్బంగా 1550 మంది మహిళా సమాఖ్య సభ్యులకు 102 కోట్ల విలువ గల చెక్కును అందజేశారు. రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళ శక్తి క్యాంటీన్, దస్నాపూర్ సమీపంలోని చిలుకూరి లక్ష్మీనగర్‌లో బిసి స్టడీ సర్కిల్ కోసం టియుఎఫ్‌ఐడిసి పనులు, పిహెచ్‌సి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఎంపిడిఒ మావల కార్యాలయంలో మోడల్ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన, మావల మండలం, దుబ్బగూడలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

పట్టణంలోని రిమ్స్ ఆసుపత్రిలో ట్రాన్స్‌జెండర్ల క్లినిక్‌ను కైలాష్‌నగర్ ఎంఎల్‌సి క్యాంప్ కార్యాలయం ఎదురుగా కమాండ్ కంట్రోల్ రూమ్‌ను ప్రారంభించి, పోగొట్టుకున్న మొబైల్ ఫోన్‌లను బాధితులకు అందజేశారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలలో భాగంగా భైక్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించి, పలువురికి హెల్మెట్లు అందజేశారు. మున్సిపల్ పట్టణంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల కోసం కేటాయించిన రూ.10 కోట్ల నిధులతో ఎంఎల్‌ఎ ఆధ్వర్యంలో శంకుస్థాపన చేసి, అనతికాలంలోనే నిర్మాణాలు చేపట్టి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని అన్నారు. ఆయా కార్యక్రమాల్లో పార్లమెంట్ సభ్యుడు నగేష్, ఎంఎల్‌సి దండే విఠల్, ఎంఎల్‌ఎ పాయల్ శంకర్, జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎస్‌పి గౌస్ ఆలం, అదనపు కలెక్టర్ శ్యామాలదేవి, ట్రైనీ కలెక్టర్ అభిగ్యాస్, పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, ఆయా శాఖల అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News