Thursday, January 9, 2025

మహిళలకు రూ.2500

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో కాంగ్రెస్ పార్టీ మహిళల కోసం “ ప్యారీ దీదీ యోజన ” ను ప్రకటించింది. ఈ స్కీమ్ కింద మహిళలకు నెలనెలా రూ.2500 ఆర్థిక సాయం అందనుంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారం లోకి వచ్చిన వెంటనే ఈ పథకాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చింది. సోమవారం నాడు ఇక్కడ మీడియా సమావేశంలో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ ఈ పథకం వివరాలు తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తుండటంతో ప్రజల్లో నమ్మకం పెరిగినట్టు ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు దేవేందర్ యాదవ్ తెలిపారు. కర్ణాటక, తెలంగాణ, హిమాచలప్రదేశ్, జార్ఖండ్, ఛత్తీస్‌గడ్‌ల్లో ఏవైతే వాగ్దానాలు చేశామో వాటన్నింటినీ అమలు చేశామని , ప్రజా విశ్వాసాన్ని పొందగలిగామని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News