Thursday, January 9, 2025

యువకుడి బ్లాక్‌మెయిల్..కారులోనే ప్రేమ జంట సజీవ దహనం

- Advertisement -
- Advertisement -

కారులో నిప్పు అంటించుకొని ఓ ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఔటర్ సర్వీస్ రోడ్డులో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిలా, బీబీనగర్ మండలం, జమిలాపేట్‌కు చెందిన పర్వతం అంజయ్య కుమారుడు పర్వతం శ్రీరాం (26) పోచారం మున్సిపల్ పరిధి నారాపల్లిలో సైకిల్ షాపు నడుపుతున్నాడు. సమీపంలో నివాసం ఉంటున్న నిఖిత (17), శ్రీరాం గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ విషయం తెలుసుకున్న నిఖిత సమీప బంధువు, పోచారం మున్సిపాలిటీ పరిధి మక్తాకు చెందిన చింటు అనే యువకుడు ఈ ప్రేమ వ్యవహారం గురించి ఇంట్లో చెబుతానంటూ బెదిరింపులకు పాల్పడుతూ పలుమార్లు డబ్బులు డిమాండ్ చేశాడు.

15 రోజుల వ్యవధిలో లక్షా 35 వేల రూపాయలు ఇవ్వగా మరిన్ని డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో యువకుడి వేధింపులు తాళలేక భయందోళనకు గురైన ప్రేమ జంట, మేడిపల్లి సమీపంలో సెల్ఫ్ డ్రైవ్ కారు తీసుకొని ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్ పరిధి ఘణపూర్ సమీపంలో ఔటర్ సర్వీస్ రోడ్డుపై కారులోనే పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నారు. శ్రీరాం మంటలకు తాళలేక కారు డోర్ తీసుకొని బయటకు వచ్చి ఫుట్‌పాత్‌పై పడి మరణించగా, నిఖిత కారులోని సజీవ దహనమైంది. తాము ఆత్మహత్య చేసుకుంటున్నామని ముందుగానే బాలిక తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు సూసైడ్ నోట్ రాసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ పరుశురాం తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News