Monday, February 10, 2025

నార్సింగిలో మహిళ హత్య

- Advertisement -
- Advertisement -

ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళ హత్యకు గురైన సంఘటన నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో మంళవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…వికారాబాద్ జిల్లా, దౌల్తాబాద్ గ్రామానికి చెందిన మొగులమ్మ(40) బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని హైదర్షాకోట్ గ్రామం, నర్సారెడ్డి కాలనీలోని ఓ గుడిసేలో ఉంటోంది. మొగులమ్మ ఇళ్లల్లో పనిచేస్తూ బ్రతుకుతోంది. మొగులమ్మ భర్త కొద్ది రోజుల క్రితం మృతిచెందాడు.

తన పదేళ్ల కుమారుడిని గ్రామంలో ఉంచి ఇక్కడ పనిచేస్తోంది. నగరంలో కూలీ పనులు చేస్తూ కుటుంబాని పోషించుకుంటోంది. ఈ క్రమంలోనే మంగళవారం తెల్లవారుజామున మొగులమ్మ గుడిసెలో మృతిచెంది ఉంది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు నార్సింగి పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News