Thursday, January 9, 2025

ప్రత్యేక దర్శనాలు రద్దు: టిటిడి ఛైర్మన్  

- Advertisement -
- Advertisement -

తిరుపతి: ప్రపంచ వ్యాప్తంగా హిందువుల వైకుంఠ ద్వార దర్శనంపై మాట్లాడుతున్నారని టిటిడి చైర్మన్ బి ఆర్ నాయుడు తెలిపారు. పది రోజుల వైకుంఠ ద్వార దర్శనాలకు టిటిడి అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. అన్నమయ్య భవనంలో టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు మీడియాతో మాట్లాడారు. తిరుపతిలో ఈ నెల 10న ఉదయం 8 గంటలకు సర్వదర్శనం ప్రారంభమైందని,  ఈ నెల 10 న ఉదయం 4:30 గం.లకు ప్రోటో కాల్ దర్శనాలు ఉంటాయని వివరించారు. టోకెన్లు కలిగిన భక్తులకే దర్శనాలకు అనుమతి ఉంటుందని ఆయన చెప్పారు. ఈ నెల 10 న ఉదయం 9 నుంచి 11 గంటల వరకు  స్వర్ణ  రథం దర్శనం ఉంటుందని, సామాన్య భక్తుల కోసం సిఫార్సు లేఖలతో పాటు ప్రత్యేక దర్శనాలను పది రోజులు  రద్దు చేశామని నాయుడు స్పష్టం చేశారు. తిరుపతిలోని టోకెన్ల జారీ కేంద్రాల వద్ద ఇప్పటికే భక్తులతో కిక్కిరిసి పోయాయని టిటిడి ఛైర్మన్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News