- Advertisement -
తెలంగాణ హైకోర్టులో మాజీ మంత్రి కెటిఆర్ కు స్వల్ప ఊరట లభించింది. ఎసిపి కేసులో కెటిఆర్ వెంట న్యాయవాది వెళ్లేందుకు కోర్టు అనుమతించింది. కెటిఆర్ లంచ్ మోషన్ పిటిషన్ పై బుదవారం న్యాయస్థానం విచారణ చేపట్టింది. దీనిపై వాదనలు విన్న కోర్టు.. ఏసీబీ విచారణకు న్యాయవాదిని తీసుకెళ్లేందుకు అనుమతిచ్చింది. అయితే, విచారణ సమయంలో కెటిఆర్ తోపాటు న్యాయవాదులు ఉండరాదని పేర్కొంది. లాయర్ కేవలం విజువల్ గా మాత్రమే చూడటానికి అనుమతిస్తున్నట్లు కోర్టు పేర్కొంది. ముగ్గురు లాయర్ల పేర్లు తమకు ఇస్తే.. ఒకరిని ఫైనల్ చేస్తామని న్యాయయూర్తి తెలిపారు. తదుపరి విచారణ సాయంత్రం 4 గంటలకు వాయిదా వేశారు.
- Advertisement -