Thursday, January 9, 2025

రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్స : నితిన్ గడ్కరీ

- Advertisement -
- Advertisement -

రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్సను అందించేందుకు ప్రత్యేక పథకాన్ని అమలు చేయనున్నట్టు కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ఎవరైనా రోడ్డు ప్రమాదంలో గాయపడితే చికిత్సకు అయ్యే ఖర్చులో గరిష్ఠంగా రూ.1.50 లక్షలు ఈ పథకం ద్వారా ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. అయితే ఇది మొదటి ఏడు రోజుల చికిత్సకు అయ్యే బిల్లుకు మాత్రమే వర్తిస్తుందని చెప్పారు.

ప్రమాద సంఘటన జరిగిన 24 గంటల్లోగా పోలీసులకు సమాచారం అందిస్తేనే ఈ పథకం ద్వారా చికిత్స పొందవచ్చని స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ పథకాన్ని పైలట్ ప్రాజెక్టు కింద పలు రాష్ట్రాల్లో అమలు చేస్తున్నట్టు చెప్పారు. 2025 మార్చి నాటికి దేశ వ్యాప్తంగా ప్రారంభించనున్నట్టు తెలిపారు. అదే విధంగా హిట్ అండ్ రన్ కేసుల్లో చనిపోయిన వారి కుటుంబాలకు రూ. 2 లక్షల వంతున ఎక్స్‌గ్రేషియో అందిస్తామని పేర్కొన్నారు. పలు రాష్ట్రాల రవాణాశాఖ మంత్రులతో గడ్కరీ సమావేశ మయ్యారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News