- Advertisement -
రాష్ట్రంలో 1,365 గ్రూప్ 3 పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్ష ప్రిలిమినరీ కీని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 1,401 కేంద్రాల్లో గత ఏడాది నవంబర్ 17,18 తేదీలలో ఈ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. మొత్తం మూడు పేపర్లకు నిర్వహించిన ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 5.36 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా,
2,69,483 మంది మాత్రమే పరీక్షకు హాజరయ్యారు. గ్రూప్ 3 ప్రిమిలినరీ కీ పై ఈ నెల 12వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో అభ్యంతరాలు స్వీకరించనున్నారు. అభ్యంతరాలు ఇంగ్లీష్‌లోనే తెలపాలని, అభ్యర్థులు లేవనెత్తిన అంశాలకు సంబంధించిన ఆధారాల కాపీలను ఆన్‌లైన్‌లో సమర్పించాలని సూచించారు. ఈ మెయిల్, వ్యక్తిగతంగా ఇచ్చే అభ్యంతరాలను ఎట్టిపరిస్థితుల్లో అనుమతించబోమని కమిషన్ స్పష్టం చేసింది.
- Advertisement -