Thursday, January 9, 2025

విద్యార్థినులకు గొడ్డు కారంతో భోజనం:కెటిఆర్

- Advertisement -
- Advertisement -

మహాత్మాగాంధీ యూనివర్సిటీలోని హాస్టల్లో విద్యార్థినులకు బ్రేక్‌ఫాస్ట్‌కు బదులు గొడ్డుకారం అన్నం పెట్టడంపై బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ స్కూల్ పిల్లలకు పౌష్టికాహారం కింద ఉప్పు, కారం, బియ్యం.. ఈ అమానవీయ పరిస్థితిపై స్పందించగల జాతీయ లేదా ప్రాంతీయ మీడియాకు ఈ శీర్షికను సూచిస్తున్నామని తెలిపారు. హాస్టల్ విద్యార్థినులకు గొడ్డు కారంతో భోజనం పెట్టడంపై కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీపైనా కెటిఆర్ విమర్శలు గుప్పించారు. ప్రియాంక గాంధీ 2019లో ఆమె చేసిన ప్రకటనను గుర్తు చేసుకుని తెలంగాణ విద్యార్థులకు లబ్ధి చేకూర్చాలని సూచించారు.

లేదా యుపిలో జరిగినప్పుడే దీన్ని జాతీయ సమస్యగా పరిగణిస్తారా..? వేరే రాష్ట్రంలో జరిగిన అలాగే చూస్తారా..? అని నిలదీశారు. ఇది తెలంగాణ కాబట్టి ఉప్పు మాత్రమే కాకుండా.. ఉప్పుతో పాటు కారం కూడా ఉండటంతో వార్తకు తీవ్రత తగ్గిందా..? లేదా సమస్య తీవ్రత తగ్గిందని భావిస్తున్నారా..? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ఒక ప్లేట్ భోజనం ఖర్చు రూ.32,000 మాత్రమే..చదువుకునే పేద విద్యార్థులకు గొడ్డు కారం వారెవ్వా ప్రజాపాలన..శభాష్ ఇందిరమ్మ రాజ్యం అంటూ మరో ట్వీట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News