Thursday, January 9, 2025

కెటిఆర్ జైలుకు పోవడం ఖాయం: ఎంఎల్ఎ వేముల వీరేశం

- Advertisement -
- Advertisement -

కెటిఆర్ జైలుకు పోవడం ఖాయమన్న విషయం అర్థమై బిఆర్‌ఎస్ నాయకులు సిఎం రేవంత్ రెడ్డిపై అడ్డగోలుగా మాట్లాడుతున్నారని నకిరేకల్ ఎమ్మెల్యే, వేముల వీరేశం అన్నారు. రూ.55 కోట్లను విదేశీ కంపెనీకి బదిలీ చేసి ఆ తప్పును బుకాయించడానికి కెటిఆర్ ప్రయత్నిస్తున్నారన్నారు. సీఎల్పీలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సిఎం రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని బిఆర్‌ఎస్ నాయకులు ఆరోపణలు చేస్తున్నారని, మంత్రివర్గ ఆమోదం లేకుండా నోటిమాటగా రూ.55 కోట్లను ఏ విధంగా బదిలీ చేస్తారని ఆయన ప్రశ్నించారు. అవినీతి చేస్తే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుందా..? అని ఆయన అన్నారు. హైదరాబాద్ ను తామే నిర్మించామన్నట్లుగా కెటిఆర్ వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. పదే పదే అబద్దాన్ని గట్టిగా చెబితే ప్రజలు నమ్ముతారని కెటిఆర్, హరీష్ రావు అనుకుంటే పొరపాటని,

తెలంగాణను సర్వం దోచుకున్నారని ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టే బిఆర్‌ఎస్‌ను ఓడించారని ఆయన ఎద్దేవా చేశారు. అవినీతి అక్రమాలను బయటకు వస్తుంటే వాటిని డైవర్ట్ చేయడానికి బిఆర్‌ఎస్ ప్రయత్నాలు చేస్తుందన్నారు. ప్రతి వ్యవసాయ భూమికి రైతు భరోసా ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారని, రైతుభరోసా విషయంలో రైతు సంతోషంగా ఉన్నారని, బిఆర్‌ఎస్ నేతలకు జీర్ణం కావడం లేదని ఆయన ఆరోపించారు. అక్రమంగా కూడబెట్టిన భూములకు డబ్బులు రావన్న బాధ బిఆర్‌ఎస్ నాయకులు ఉందని ఆయన ఆరోపించారు. దర్యాప్తు సంస్థల దగ్గర వెళ్లకుండా అడ్డదారులు వెతుక్కుంటున్నారని, నేరం చేయకపోతే దర్యాప్తు సంస్థలకు సహకరించాలని, దర్యాప్తు సంస్థల నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తున్నారంటే కెటిఆర్ తప్పు చేశారని అర్థమవుతోందన్నారు. బిఆర్‌ఎస్ ఎన్ని ధర్నాలు, ఆందోళనలు చేసినా తెలంగాణ ప్రజలు నమ్మరని, తెలంగాణ సమాజం బిఆర్‌ఎస్ నేతలను చట్టం ముందు దోషులుగా నిలబెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News