Friday, January 10, 2025

గురువారం రాశి ఫలాలు(09-01-2025)

- Advertisement -
- Advertisement -

మేషం – ముందు జాగ్రత్త లేకపోవడం వలన ఒక సందర్భంలో చిన్నపాటి ఒడిదుడుకులు మాత్రం ఎదుర్కొనవలసి వస్తుంది. చేపట్టిన కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు.

వృషభం –  మీ నైపుణ్యమునకు సామర్ధ్యమునకు తగినటువంటి స్థానమును సంపాదించుకోవడానికి విశేషంగా కృషి చేస్తారు. ఆత్మవిశ్వాసం మనోధైర్యం పెరుగుతాయి.

మిథునం – స్నేహ సంబంధాలను మరింతగా అభివృద్ధి చేసుకునే విధంగా అడుగులను ముందుకు వేస్తారు. శ్రమ ఫలిస్తుంది. కొనుగోలు అమ్మకాలకు సంబంధించిన విషయాలలో అజాగ్రత్త తగదు.

కర్కాటకం – వివాదాలకు దూరంగా ఉంటారు. మీ పైనున్న గుడ్ విల్ ను నిలుపుకోగలుగుతారు. బంధు వర్గం వారికి ఆర్థిక సహాయం చేయవలసిన స్థితి మీకు తప్పకపోవచ్చు.

సింహం – భాగస్వాముల నుండి రావాల్సిన ముఖ్యమైన పత్రాలు సకాలంలో అందడం వలన లాభపడతారు. శుభకార్య యత్నాలలో శుభ సూచనలు కనబడతాయి.

కన్య – పరిస్థితులకు లోబడి ఇతరులకు ఇచ్చిన మాటను కొంతకాలానికి వాయిదా వేస్తారు. ఆర్థిక వ్యవహారాలపైన ఎక్కువగా దృష్టిని కేంద్రీకరిస్తారు. పొదుపును పాటించడానికి వ్యుహ రచన చేస్తారు.

తుల – కుటుంబ పరమైన చికాకులు వృత్తి ఉద్యోగాల మీద ప్రభావం చూపించకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన తరుణం. తద్వారా లాభపడతారు. ప్రత్యర్థుల దాడిని నేర్పుగా తిప్పి కొట్టగలుగుతారు.

వృశ్చికం – ముఖ్య విషయాలలో స్వయం నిర్ణయాలకే ప్రాముఖ్యతను ఇస్తారు. ముఖ్యమైన విషయ వ్యవహారాలు వాటికి సంబంధించిన ఫలితాలు కూడా అనుకూలంగానే ఉంటాయి.

ధనుస్సు – వ్యాపారంలో పోటీని ఎక్కువగా ఎదుర్కొనవలసి వస్తుంది. మీ విజయమే మీ శత్రువులకు సమాధానం చెబుతుందని ఆత్మస్థైర్యంతో ముందడుగు వేస్తారు. మంచి నిర్ణయాలను తీసుకోగలుగుతారు.

మకరం –  సమాజంలో మీ స్థాయి గౌరవం పెరుగుతాయి. ఆరోగ్యపరంగా స్వల్పమైన ఒడిదుడుకులను ఎదుర్కొనవలసి వస్తుంది. మీ ఆలోచనలు మెరుగ్గా చురుగ్గా ఉంటాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు అవసరం.

కుంభం –  ఆర్థిక వనరులు సమృద్ధిగా ఉంటాయి. ఖర్చులు అధికంగా ఉండటం వలన అవసరాలకు సరిపడ ధనాన్ని సంపాదించుకోవడానికి ప్రాముఖ్యత ఇచ్చి ఆ విషయం పైన దృష్టిని కేంద్రీకరిస్తారు.

మీనం – రొటీన్స్ సంతకాల విషయంలో జాగ్రత్తలు పాటించండి. వృత్తి ఉద్యోగ వ్యాపారాదులలో చెప్పుకోదగిన రీతిలో కష్టించి సానుకూల ఫలితాలను సాధిస్తారు. ఆర్థిక వ్యవహారాలలో పురోగతిని సాధిస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News