Friday, January 10, 2025

త్వరలో స్థానిక సమరం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించబోతున్నామని, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను కాం గెస్ కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచించారు. పాతబస్తీలో కొత్తగా నిర్మించిన ఫ్లైఓవర్‌కు మన్మోహన్ సింగ్ పేరు పెట్టామని, జనవరి 26వ తేదీ నుంచి రైతు భరోసా అం దించబోతున్నామని సిఎం పేర్కొన్నారు. వ్యవసాయ కూలీల కుటుంబాలకు ఏడాదికి ఒక్కో కుటుంబానికి రూ.12వేలు అందించబోతున్నామని, కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతున్నామని ఆయన తెలిపా రు. ఎఐసిసి ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ అధ్యక్షతన గాంధీభవన్‌లో టిపిసిసి రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యఅతిథిగా ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసి వేణుగోపాల్, సిఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, టిపిసిసి అధ్యక్షుడు, ఎంఎల్‌సి మహేష్ కుమార్ గౌడ్ తో పాటు 23 మంది సభ్యులు పాల్గొన్నారు.

మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మృతికి సంతాప సూచకంగా రెండు నిమిషాలు మౌనం పాటించిన అనంతరం పిఏసి సమావేశం కొనసాగింది. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి సంతాపం తెలిపామని ఆయన పేర్కొన్నారు. మన్మోహన్ సింగ్‌కు భారత రత్న ఇవ్వాలని అసెంబ్లీ లో ఏకగ్రీవ తీర్మానం చేశామని ఆయన తెలిపారు. మన్మోహన్ ప్రధానిగా ఉన్నప్పుడే ఈ రాష్ట్ర ఏర్పాటు జరిగిందన్నారు. మొదటి ఏడాదిలోనే 55,143 ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు భర్తీ చేశామని, రూ.21 వేల కోట్ల రుణమాఫీ చేశామని ఆయన పేర్కొన్నారు. ఏడాదిలో రూ.54వేల కోట్లు రైతుల సంక్షేమం కోసం ఖర్చు చేశామని, రూ .500లకే సిలిండర్ ఇస్తున్నామని, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నామని, మహిళలకు ఆర్టీసిలో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నామని, ఇప్పటి వరకు రూ. 4,000 కోట్లు ప్రభుత్వం ఆర్టీసికి చెల్లించిందని ఆయన అన్నారు.

ఆరు గ్యారంటీలను అమలు చేసేందుకు కృషి: టిపిసిసి అధ్యక్షుడు
టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తోందన్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు. ఆరు గ్యారంటీలను అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే అమలు చేసేందుకు కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు. ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కె.సి వేణుగోపాల్ పీఏసీ సమావేశానికి రావడం చాలా సంతోషకరమన్నారు. ఆరు గ్యారంటీల అమల్లో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి ప్రజల నుంచి మంచి స్పందన ఉందన్నారు. ప్రియాంక గాంధీపై బిజెపి నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తూ నిరసనలు వ్యక్తం చేశామని ఆయన తెలిపారు. అంబేడ్కర్ విషయంలో అమిత్ షా చేసిన అవమానకర మాటలు దేశ వ్యాప్తంగా నిరసన వ్యక్తం అయ్యాయని ఆయన తెలిపారు. తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో ఉద్యమాలు చేశారని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో రైతులకు రుణ మాఫీ, రైతు భరోసా, 500 రూపాయలు బోనస్ లాంటి అనేక పథకాలు అమలు చేశామని ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News