33శాతం పెంచమని యుబిఎల్ కోరుతోంది
అదే జరిగితే రాష్ట్రంలో ఒక్కో బీరు ధర రూ.250
దాటుతుంది రేట్ల పెంపుపై రిటైర్డ్ జడ్జితో
కమిటీ వేశాం నివేదిక రాగానే ధరలపై
నిర్ణయం ఏకపక్షంగా వ్యవహరిస్తున్న బెవరేజేస్
కంపెనీ రాష్ట్రంలో 14లక్షల బీర్ల కేసుల స్టాక్
ఉంది మీడియా సమావేశంలో మంత్రి జూపల్లి
మనతెలంగాణ/హైదరాబాద్:మద్యం ధరలు పెంచనందుకు బీర్ల ఉత్పత్తిని నిలిపివేస్తామని యునైటెడ్ బ్రేవరీస్ లిమిటెడ్ (యూబిఎల్) సంస్థ ప్రకటించిందని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. బు ధవారం సాయంత్రంసచివాలయం వద్ద మీడి యా పాయింట్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 33 శాతం ధర లు పెంచమని యూబిఎల్ కంపెనీ అడుగుతుందని అలా పెంచితే ప్రస్తుతం రూ. 150లు ఉన్న బీరు ధర 250లు అవుతుందని మంత్రి తెలిపారు. బేవరేజ్ సంస్థ అడిగినట్లు రేట్లు పెం చితే ప్రజలపై భారం పడుతుందన్నారు. రేట్లు పెంపు కోసం రిటైర్డ్ జడ్జితో కమిటీ వేశామని మంత్రి తెలిపారు. కమిటీ నివేదిక వచ్చాక రేట్ల పెంపుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు.
బేవరేజ్ సంస్థ గుత్తాధిపత్యంగా ప్రవర్తిస్తుందని ఆయన ఆరోపించారు. ఆ సంస్థకు బకాయిలు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని, ఆ సంస్థ నష్టాల్లో ఉందని చెబుతోందని మంత్రి జూపల్లి పేర్కొన్నారు. ఎక్సైజ్ శాఖలో రూ.2,500 కోట్లు గత ప్రభుత్వం బకాయిలు పెట్టిందన్నారు. గత ప్రభుత్వం పెట్టిన బాకీలు కొన్ని ఉన్నాయని, ఇప్పటికే రూ.11 వందల కోట్లు బకాయిలను ఆ సంస్థకు చెల్లించామని, ఇంకా రూ.658.95 కోట్లు పెండింగ్ బకాయిలను చెల్లించాల్సి ఉందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో 14 లక్షల బీర్ల కేసుల స్టాక్ ఉందని, ఇతర రాష్ట్రాలతో పోల్చితే కొంత తక్కుగానే ఉందని ఆయన తెలిపారు. కర్ణాటకలో బీర్ల రేటు రూ. 190లు, ఎపిలో రూ.180లుంటే తెలంగాణలో మాత్రం రూ. 150లు మాత్రమే బీరు రేటు ఉందని, ఒత్తిళ్లకు తమ ప్రభుత్వం లొంగదని, తాము వచ్చాక ఒక్క పైసా కూడా ట్యాక్స్ పెంచలేదని మంత్రి జూపల్లి తెలిపారు.