Friday, January 10, 2025

తిరుమలలో తొక్కిసలాట.. ఆరుగురు భక్తులు దుర్మరణం

- Advertisement -
- Advertisement -

తిరుమలవైకుంఠ ద్వార దర్శన టికెట్ల జారీలో అపశృతి చోటు చేసుకుంది. వైకుంఠ దర్శన టికెట్ల కోసం భక్తులు ఎగబడడంతో తొక్కిసలాట జరిగి నలుగురు భక్తులు మృతిచెందారు. టికెట్ల కోసం భక్తులు పెద్దఎత్తున రావడంతో టిటిడి సిబ్బంది పద్మావతి పార్కు నుంచి క్యూలైన్‌లోకి వారిని ఒక్కసారిగా వదిలారు. దీంతో శ్రీనివాసం, బైరాగిపట్టెడ, సత్యనారాయణపురం కేంద్రాల వద్ద పెద్దఎత్తున తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో తమిళనాడు కు చెందిన మల్లిక సహా పలువురు భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే మల్లిక అనే మహిళను ముందుగా ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషంగా ఉండడంతో అనంతరం రుయాకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు. కాగా, తొక్కిసలాటలో గాయపడిన మిగిలి వారిని సిమ్స్, రుయాకు తరలించారు. అయితే రుయాలో చికిత్స పొందుతూ మరో ఐదుగురు భక్తులు మృతిచెందారు. దీంతో మెుత్తం మృతుల సంఖ్య ఆరు కు చేరింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News