Friday, January 10, 2025

మాజీ మంత్రి హరీశ్‌రావు హౌస్ అరెస్ట్..

- Advertisement -
- Advertisement -

మాజీ మంత్రి హరీశ్‌రావు హౌస్ అరెస్ట్ అయ్యారు. నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మణికొండ మునిసిపాలిటీలో పుప్పాల గూడ క్రిన్స్ విల్లాస్లో హరీష్ రావును పోలీసులు గృహ నిర్భంధం చేశారు. గురువారం మాజీ మంత్రి కెటిఆర్..ఫార్ములా ఈ రేస్ కేసులో ఎసిబి అధికారులు ముందు విచారణకు హాజరు కానున్నారు. ఈక్రమంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి ఉద్రిక్తత ఘటనలు జరగకుండా ముందుగానే జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే హరీశ్ రావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఇవాళ ఉదయమే ఆయన నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించారు.

కాగా, నిన్నబిఎల్ఎన్ రెడ్డిని ఎసిబి విచారించారు. దాదాపు 9 గంటలపాటు విచారించిన అధికారులు.. పలు ప్రశ్నలు సంధించారు. ఫ్మార్ముల ఈ-కార్‌ రేసు కేసులో కీలక సూత్రధారిగా ఉన్న బిఎల్ఎన్ రెడ్డి.. రూ.55 కోట్ల నిధులను ఆర్బీఐ అనుమతి తీసుకోకుండానే ఎఫ్ఈఓకు బదిలీ చేశారు. అయితే, అప్పటి మంత్రి కెటిఆర్ ఆదేశాల మేరకు బదిలీ చేసినట్లు ఆయన ఎసిబి అధికారులకు చెప్పినట్లు తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News