Friday, January 10, 2025

ఫార్ములా ఈ రేస్‌ని ఎంతో కష్టపడి తీసుకొచ్చాం: కెటిఆర్ ట్వీట్

- Advertisement -
- Advertisement -

ఫార్ములా ఈ రేస్‌ కేసులో గురువారం ఎసిబి విచారణకు మాజీ మంత్రి కెటిఆర్ హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ట్వీట్ చేస్తూ.. ఫార్ములా ఈ రేస్‌ని తెలంగాణకు ఎంతో కష్టపడి తీసుకొచ్చామని పేర్కొన్నారు. “ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్‌ని పెంపొందించడానికి, భారతదేశానికి ప్రతిష్టాత్మకమైన ఫార్ములా ఈ రేస్‌ని తీసుకురావడానికి అవిశ్రాంతంగా కృషి చేశాం. లక్ట్రానిక్‌ వాహన రంగంలో హైదరాబాద్‌ను గమ్యస్థానంగా మార్చడమే ఎజెండాగా ఈ నిర్ణయం తీసుకున్నాం. ఈ ప్రతిష్టాత్మక నిర్ణయం సాకారం చేసుకునే ప్రయత్నంలో ఫార్ములా-E రేస్ ఒక భాగం. TMV (తెలంగాణ మొబిలిటీ వ్యాలీ) క్లస్టర్‌లను ఉపాధి, ఆదాయాన్ని సృష్టించే ఎలక్ట్రిక్ వాహనాల ఆవిష్కరణ, పరిశోధన, తయారీకి కేంద్రంగా మార్చడం కోసం సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాం. 2023 ఇ-మొబిలిటీ వారంలో 12,000 కోట్లకు పైగా మార్క్యూ పెట్టుబడులను తీసుకురావడం ప్రారంభించాం. చిల్లర రాజకీయాలతో నడిచే చిన్న మనసులకు ఇవేమీ అర్థం కాకపోవచ్చు కానీ.. తెలంగాణ ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. నిజాన్ని, తమ విజన్ ను అర్థం చేసుకుంటారనే నమ్మకం ఉంది. సత్యం, న్యాయం ఎప్పుడూ గెలుస్తుంది” అని ‘ఎక్స్‌’లో కెటిఆర్‌ పోస్ట్‌ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News