Friday, January 10, 2025

అమెరికాలో కార్చిచ్చు విధ్వంసం.. ఆస్కార్ 2025 నామినేషన్లు వాయిదా

- Advertisement -
- Advertisement -

అగ్రరాజ్యం అమెరికాలో కార్చిచ్చు విధ్వంసం సృష్టించింది.అమెరికాలో కుబేరులకు ఆవాసాలైన మూడు నగరాల్లో ఒకటైన లాస్‌ఏంజెలెస్ సిటీ లోని అత్యంత ఖరీదైన ది పాలిసాడ్స్ ప్రాంతంలో కార్చిచ్చు చెలరేగింది. దీంతో వేలాది ఎకరాల్లోని విలాసవంతమైన ఇళ్లు అగ్నికి ఆహుతి అవుతున్నాయి.  సంపన్న వర్గాలు నివసించే ఈ ప్రాంతాన్ని కార్చిచ్చు ముట్టడించడంతో.. పలువురు హాలీవుడ్ నటుల ఇండ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి.

ప్రస్తుతం లాస్ ఏంజెల్స్‌లో కార్చిచ్చు కొనసాగుతున్న ఈ క్రమంలో ఆస్కార్ 2025 నామినేషన్ల ప్రక్రియ వాయిదా పడింది. అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ఆస్కార్ నామినేషన్ ఓటింగ్ విండోను పొడిగించింది. దాదాపు 10,000 మంది అకాడమీ సభ్యుల కోసం ఓటింగ్ జనవరి 8న ప్రారంభమైంది.. జనవరి 12న ముగుస్తుంది. ఈ ప్రమాదం కారణంగా గడువును రెండు రోజులు పొడిగించారు. దీంతో ఓటింగ్ జనవరి 14న ముగియనుంది. ఇక, జనవరి 17న ప్రకటించాల్సిన నామినేషన్ల ప్రకటనను జనవరి 19కి వాయిదా వేశారు. అకాడమీ సీఈఓ బిల్ క్రామెర్ తేదీలలో మార్పులను వివరిస్తూ సభ్యులకు ఇమెయిల్ పంపించారు.

కాగా, కార్చిచ్చు వేగంగా వ్యాపిస్తుండటంతో దాదాపు 30 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. చాలా మంది తమ సామగ్రి, వాహనాలను అక్కడే వదిలేసి ప్రాణాలు కాపాడుకోవడానికి తరలివెళ్లిపోయారు. ఒకవైపు వీధుల్లో పొగ కమ్మేయగా, మరోవైపు ఒక్కసారిగా జనం రోడ్ల పైకి రావడంతో చాలా చోట్ల ట్రాఫిక్ స్తంభించింది. ఇక్కడ కొండలపై ఉన్న రహదారులు ఇరుగ్గా ఉంటాయి. దీనికి తోడు గాలులు ఎక్కువగా వీచడంతో మంటలు తొందరగా వ్యాపిస్తున్నాయి. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News