Friday, January 10, 2025

బాలకృష్ణ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్.. ‘డాకు మహారాజ్‌’ ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు

- Advertisement -
- Advertisement -

నందమూరి బాలకృష్ణ అభిమానులకు బ్యాడ్ న్యూస్. ఆయన నటించిన ‘డాకు మహారాజ్‌’ సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. ఈ క్రమంలో మూవీ మేకర్స్ ప్రమోషన్స్ లో భాగంగా గురువారం అనంతపురంలో ఘనంగా ప్రీరిలీజ్ ఈవెంట్ ను ప్లాన్ చేశారు. అయితే, తాజాగా ఈ ఈవెంట్ ను రద్దు చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. నిన్న తిరుమలలో జరిగిన తొక్కిసలాట ఘటన విచారం వ్యక్తం చేస్తూ ఈవెంట్ ను క్యాన్సిల్ చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ఈ మేరకు ఎక్స్ లో పోస్ట్ చేస్తూ.. ‘‘తిరుపతిలో జరిగిన ఘటనకు మా చిత్రబృందమంతా ఎంతో బాధ పడుతోంది. పవిత్ర స్థలంలో ఇలాంటి ఘటన జరగడం హృదయ విదారకంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను జరపడం సరికాదని భావిస్తున్నాం.  బాధాతప్త హృదయంతో, భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని అత్యంత గౌరవంతో  నేడు జరగాల్సిన కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నాం. ఈ కష్ట సమయంలో మీ అందరి మద్దతు ఉంటుందని ఆశిస్తున్నాం’’ అని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News