Friday, January 10, 2025

CNG ఫ్యూయల్ కార్డ్‌ను విడుదల చేసిన AG అండ్ P ప్రథమ్ సంస్థ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: స్వచ్ఛమైన ఇంధన పర్యావరణ వ్యవస్థను నిర్మించడానికి, అసాధారణమైన కస్టమర్ అనుభవాలను అందించడానికి కట్టుబడి ఉండటంతో పాటుగా, దాని ఫీచర్ ప్యాక్డ్ మైలేజ్+ CNG ఫ్యూయల్ కార్డ్‌ను AG&P ప్రథమ్ సంస్థ థింక్ గ్యాస్ విడుదల చేసింది. ఈ కార్డును మల్టీ-సిటీ లైవ్ ఈవెంట్‌లో సీనియర్ నాయకత్వం సమక్షంలో AG&P ప్రథమ్ సంస్థ థింక్ గ్యాస్, చైర్మన్ అమితవ సేన్‌గుప్తా విడుదల చేశారు.

అత్యుత్తమ శ్రేణి భదత్రా ఫీచర్‌లతో సౌకర్యవంతమైన, సురక్షితమైన కస్టమర్ అనుభవాన్ని ఈ వినూత్న కార్డ్‌తో, కస్టమర్‌లు ఆస్వాదించవచ్చు. ఈ కార్డ్ ఇంధన, సురక్షితమైన & సౌకర్యవంతమైన నగదు రహిత చెల్లింపుల కోసం రీడీమ్ చేయదగిన క్యాష్‌బ్యాక్‌ను అందిస్తుంది, ఒకే మాస్టర్ ఖాతాను ఉపయోగించి తమ మొత్తం ఫ్లీట్‌ను పర్యవేక్షించడానికి నిర్వాహకులకు వీలు కల్పిస్తుంది.

కార్డు ఆవిష్కరణ సందర్భంగా AG&P ప్రథమ్ సంస్థ- థింక్ గ్యాస్ చైర్మన్ అమితవ సేన్‌గుప్తా మాట్లాడుతూ..“మైలేజ్+ ఫ్యూయల్ కార్డ్ అనేది మా స్టేషన్‌లలో కస్టమర్ అనుభవాన్ని పునర్నిర్వచించే విప్లవాత్మక ఆవిషరణ. ఈ ఆవిష్కరణ స్వచ్ఛమైన, మరింత స్థిరమైన, వినియోగదారు కేంద్రీకృత ఇంధన పర్యావరణ వ్యవస్థను రూపొందించే దిశగా మా ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. ఈ కార్డ్ మా పరిశ్రమలో కొత్త ప్రమాణాలను నెలకొల్పనుంది” అని అన్నారు. జాగెల్ ఎండి & సీఈఓ, అవినాష్ గోడ్ఖిండి మాట్లాడుతూ..” AG&P ప్రథమ్ సంస్థతో ఈ సహకారం రవాణా రంగంలో అర్ధవంతమైన ప్రభావాన్ని సృష్టిస్తుంది. గ్రామీణ భారతదేశంలోని ఫ్లీట్ యజమానులు మరియు ట్రక్ ఆపరేటర్ల మార్కెట్‌కు సేవ చేయడమే లక్ష్యంగా ఉంది..” అని అన్నారు.

AG&P ప్రథమ్ సంస్థ, థింక్ గ్యాస్ MD,CEO అభిలేష్ గుప్తా మాట్లాడుతూ.. “మైలేజ్+ CNG ఫ్యూయల్ కార్డ్ అనేది మా కస్టమర్‌లు, వారి రీఫ్యూయలింగ్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించబడిన ప్రత్యేకమైన కార్డ్. ఈ కార్డ్ AG&P ప్రథమ్-థింక్ గ్యాస్ స్టేషన్‌లలో కరెన్సీగా మారుతుంది. మా కస్టమర్‌లు వారి లావాదేవీలను పర్యవేక్షించడానికి నిర్వహించడానికి అవకాశం ఇస్తుంది” అని అన్నారు. AG&P ప్రథమ్-థింక్ గ్యాస్ తన స్టేషన్‌లలో మైలేజ్+ CNG ఫ్యూయల్ కార్డ్‌ని ఉపయోగించి చేసిన CNG కొనుగోళ్లపై రూ.3/kg వరకు గణనీయమైన పొదుపును అందిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News