Friday, January 10, 2025

తాత మృతిని తట్టుకోలేక మనవడు ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

మూడు నెలల క్రితం అనారోగ్యంతో మృతి చెందిన తన తాత మరణాన్ని తట్టుకోలేక మనవడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన హైదరాబాద్‌లోని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… చనిపోయిన తన తాత కలలోకి వచ్చి అతన్ని తోడు రమ్మంటున్నాడని గత కొద్ది నెలలుగా తండ్రిదండ్రులతో చెప్పిన మనవడు మనోజ్ (27). మనస్థాపానికి గురై గురువారం సూసైడ్ లెటర్ రాసి తన ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేట్ బషీరాబాద్ పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News