విద్యార్థులకు సక్రమంగా విద్యాబుద్ధులు నేరాలిసిన ప్రధానోపాధ్యాయుడు వారిముందే లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టబడి ఉపాధ్యాయ వృత్తికే కళంకం తీసుకొచ్చాడు. వివరాల్లోకి వెళితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలోని మైనార్టీ గురుకుల పాఠశాలలో ప్రిన్సిపాల్‌గా విధులు నిర్వహిస్తున్న భీమనపల్లి కృష్ణ అదే పాఠశాలలో తెలుగు కాంట్రాక్టు ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న సంధ్యారాణి 3 నెలల జీతం విడుదలకు పదివేలు డిమాండ్ చేస్తూ కాలయాపన చేస్తున్నాడు.
కుటుంబం గడుపుకోలేని పేద పరిస్ధితుల్లో ఉన్న ఉపాధ్యాయురాలు 2 వేలకు ఒప్పందం కుదుర్చుకోని అనిశా అధికారులను ఆశ్రయించింది. ఉపాధ్యాయురాలి వద్ద గురువారం ఉదయం గురుకులంలో రూ.2 వేలు లంచం తీసుకుంటుండగా గురుకుల అటెండర్ రామకృష్ణతో పాటు ప్రిన్సిపాల్ కృష్ణను అధికారులు రెడ్‌హ్యండెడ్‌గా పట్టుకున్నారు. పట్టుబడ్డ వీరిరువురిని ఏసిబి డిఎస్పి రమేష్ అరెస్టు చేసి కోర్టుకు తరలించారు.