- Advertisement -
ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాలనలో అన్ని మతాలకు గౌరవం ఉందని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. అజ్మీర్‌లోని గరీబ్ నవాబ్ హజ్రత్ ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ దర్గాలో ఉర్సు సందర్భంగా తెలంగాణ బీజేపీ మైనారిటీ మోర్చ తరపున బీజేపీ ప్రధాన కార్యాలయంలో చాదర్‌ను పంపించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ సబ్ కా సాత్,
సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్ అనేది బీజేపి నినాదమన్నారు. ప్రదాని మోదీ నాయకత్వంలో దేశప్రజలందరికీ సంక్షేమం అందుతుందన్నారు. పదకొండేళ్ల బీజేపీ కేంద్ర పాలనలో దేశం ప్రశాంతంగా ఉందని, దేశ అభివృద్ది కోసం అన్ని మతాల ప్రజలు సహకారం అందిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో మీర్ ఫిరాసత్ అలీ బాక్రీ, చార్మినార్ అసెంబ్లీ కన్వీనర్ ప్రవీణ్, ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -