మార్చి నెలాఖరుకల్లా ప్రక్రియ పూర్తి
ఎలాంటి తప్పిదాలకు ఆస్కారం
లేకుండా పారదర్శకంగా నిర్వహణ
కొత్త స్వయం సహాయక సంఘాల
ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి మహిళా
సంఘాల ఆధ్వర్యంలో సౌరవిద్యుత్
ప్లాంట్ల ఏర్పాటు త్వరలో టెండర్లు
ఖరారు ఆరు నెలల్లో 48మంది
మున్సిపల్ కమిషనర్లు, 300 మంది
టౌన్‌ప్లానింగ్ అధికారుల నియామకం
మున్సిపల్ కమిషనర్ల సమావేశంలో
పట్టణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి
దానకిషోర్
మన తెలంగాణ/హైదరాబాద్ : ఎల్ఆర్ఎస్ (అనుమతి లేని లే ఔట్ల క్రమబద్ధీకరణ పథకం) దరఖాస్తు పరిష్కారం, కొత్తగా స్వయం సహాయక సంఘాల ఏర్పాటు పై ప్రత్యేక దృష్టి పెట్టాలని రా ష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎం. దానకిషోర్ మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. గురువారం మర్రి చెన్నారెడ్డి మా నవ వనరుల అభివృద్ధి కేంద్రంలో రాష్ట్రంలోని 142 పురపాలక సంఘాల కమిషనర్లతో రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యద ర్శి దానకిషోర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎల్ఆర్ఎస్, రెవెన్యూ, రెవెన్యూయేతర పన్ను వసూలు లక్ష్యం, ఇప్పటివరకు సా ధించిన లక్ష్యం, ఇంకా చేయాల్సిన పన్ను వసూ ళ్లు, భవన సర్వే,
మెప్మా కార్యకలాపాల ప్రగతి, తదితర అంశాలపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా దానకిషోర్ మాట్లాడుతూ ఎల్ఆర్ఎస్ దరఖాస్తు పరిష్కారం వేగవంతం చేసేందుకు క్లియర్ పట్టా భూములు ఉండి, అనుమతులు లేని లే ఔట్లను వేగంగా క్రమబద్ధీకరణ చేసేందుకు మొదట ప్రాధాన్యం ఇవ్వాల న్నారు. ఎలాంటి తప్పిదాలకు ఆస్కారం లేకుండా ఎల్ఆర్ఎస్ ప్రక్రియను పాదదర్శకంగా, మార్చినెల చివరికల్లా ఈ ప్రక్రియ పూర్తిచేయాలన్నారు. దరఖాస్తు దారులు భవన నిర్మాణ అనుమతులు తీసుకునేలా ప్రోత్సహించాలని, అర్హమైన ప్రతి మహిళ ను స్వయం సహాయక సంఘంలో చేర్పించాలని ప్రభుత్వం ఎజెండాగా పెట్టుకుందన్నారు.
బ్యాంక్ లింకేజ్ లక్ష్యాన్ని రూ. 5 వేల కోట్లకు పెంచాం
మెప్మా పరిధిలోని స్వయం సహాయక సంఘాలకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.3 వేల కోట్లను బ్యాంక్ లింకేజి కింద ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించుకుంటే , ఇప్పటి వరకు రూ.2500 కోట్లను సంఘాలకు అందించడం జరిగిందని ఆయన తెలిపారు. ఫలితంగా ప్రభుత్వం బ్యాంక్ లింకేజ్ లక్ష్యాన్ని రూ. 5 వేల కోట్లకు పెంచిందన్నారు. మిగతా రూ.2,500 కోట్లను సంఘాలకు అందించేందుకు మున్సిపల్ అధికారులు కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు. పురపాలిక పరిధిలో అర్హత ఉండి సంఘంలో సభ్యులు లేని ప్రతి మహిళను కొత్తగా సంఘాలను ఏర్పాటు చేసి సభ్యులుగా చేర్పించాలన్నారు. వచ్చే మార్చిలోగా 50 శాతం మందిని, జూన్ లోగా మిగతా 50 శాతం మందిని మొత్తం 100 శాతం మహిళలను 6 నెలల్లోగా సభ్యులుగా చేర్పించాలన్నారు. సంఘం మహిళల్లో ఎంటర్ ప్రెన్యూర్ షిప్ స్కిల్లను పెంపొందించాలన్నారు.
సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాట్లకు ప్రతి పాదనలు సిద్ధం చేయాలి
మహిళా స్వయం సహాయక సంఘాల(ఎస్‌హెచ్‌జి) ద్వారా ఏర్పాటు చేసే సౌర విద్యుత్ ప్లాంట్ల టెండర్లను త్వరలో ప్రభుత్వం ఖరారు చేయనున్న నేపథ్యంలో మెప్మా స్వయం సహాయక సంఘాల ద్వారా పట్టణాల పరిధిలోని ఖాళీ స్థలాలు, రిజర్వాయర్లు, వాటర్ ట్యాంక్‌లపై సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాట్లకు ప్రతి పాదనలు సిద్ధం చేయాలని దానకిశోర్ ఆదేశించారుఉ. రాష్ట్ర జనాభాలో 50 శాతానికి పైగా పట్టణ జనాభా ఉందన్నారు. త్వరలోనే దేశంలోనే అత్యధిక అర్బన్ ఏరియా ఉన్న మొదటి రాష్ట్రంగా తెలంగాణ అవతరించనుందన్నారు. రాష్ట్ర జిఎస్‌డిపికి 70 శాతం ఆదాయం అర్బన్ ఏరియా నుంచే వస్తుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నేతృత్వంలో ఉన్న పురపాలక శాఖ కు క్షేత్ర స్థాయిలో మంచి పేరు తెచ్చేలా అధికారులు కృషి చేయాలన్నారు.
క్షేత్ర స్థాయిలో శాఖను మరింత పటిష్టం చేసేందుకు ప్రభుత్వం వచ్చే ఆరు నెలల్లో 48 మున్సిపల్ కమిషనర్లు, 300 టౌన్ ప్లానింగ్ అధికారులను నియమించనుందని ఆయన తెలిపారు. భువన సర్వేను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఆస్తి పన్ను, ట్రెడ్ లైసెన్సు, నీటి పన్ను వసూలు ఆశించిన మేర కాలేదన్నారు. క్షేత్ర స్థాయిలో విస్తృత ప్రచారంతో పాటు ఎల్ఆర్ఎస్, రెవెన్యూ మేళాలు, ప్రత్యేక డ్రైవ్ లు నిర్వహిస్తూ మార్చి నెలాఖరులోగా వందశాతం లక్ష్యాలను సాధించాలన్నారు. పురపాలక శాఖ కమిషనర్ డాక్టర్ టికె శ్రీదేవి మాట్లాడుతూ పురపాలిక పన్నుల వసూళ్ల కు కమిషనర్ లు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. అనంతరం ముఖ్య కార్యదర్శి, కమిషనర్ పురపాలక శాఖ క్యాలండర్, డైరీని ఆవిష్కరించారు. ఈ సమావేశంలో టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ దేవేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.