Friday, January 10, 2025

మూసీలో మట్టిపోసిన సంస్థలపై సీరియస్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/సిటీ బ్యూరో: నగర శివారు లోని గండిపేట కు చేరువలోని నార్సింగి ప్రాం తంలో మూసీ నదిలోకి మట్టి పోసిన రాజపుష్ప నిర్మాణ సం స్థపై హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ సీరియస్ అయ్యారు. ఆ సంస్థలకు నోటీసులు జారీచేసినట్టు అధికారులు తెలిపా రు. అనంతరం మూసీలో పోసిన మట్టిని సద రు నిర్మాణ సంస్థ తొలగించినట్టు అధికారులు వెల్ల డించారు. మూసీ నదిలో మట్టిపోసి కబ్జా చేస్తు న్నారనేది స్థానికుల నుంచి అందిన ఫిర్యా దు లపై గత రెండు వారాల క్రితం హైడ్రా కమి షనర్ రంగనాథ్ నేరుగా ఆ ప్రాంతానికి చేర కుని క్షేత్ర స్థాయిలో మూసీనదిని, అక్కడ పోషి న మట్టిని పరిశీలించారు. మూసీనదిలోకి ని ర్మాణ సంస్థ జరగడంతో పాటు నదిని పూడ్చే క్రమంలో నింపిన మట్టిని వెంటనే తొల గిం చా లని రాజపుష్ప నిర్మాణ సంస్థను ఆదేశించారు. ఈ మేరకు మూసీకి హద్దులు నిర్ధారించాలని మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులను కమిషనర్ కోరారు. ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు,

మున్సిపాలిటీ అధికారులకు కూడా హైడ్రా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. నది 40 అడుగుల లోపలికి, 30 అడుగుల ఎత్తులో పోసిన మట్టిని రాజపుష్ప తొలగించింది. కమిషనర్ ఏవీ రంగనాథ్ గురువారం మూసీ ప్రాంతాన్ని పరిశీలించారు. మట్టిని తొలగించడాన్ని పరిశీలించిన కమిషనర్ సదరు అధికారులను అభినందించారు. మూసీలో మట్టిపొస్తున్నందుకు గతంలో కేసులు బుక్ అయిన విషయం విధితమే. హైడ్రా నిరంతరం ఫాలో అప్ చేయడంతో మట్టి పోసిన సంస్థలకు చెందిన వారే తొలగించారు. ఆ చేరువులో మట్టి పోసిన ఆదిత్య నిర్మాణ సంస్థ కూడా వారం పదిరోజుల్లో పోసిన మట్టిని తొలగిస్తామని హైడ్రా అధికారులకు హామీనిచ్చింది. ఆ తర్వాత నెక్నంపూర్ చెరువులోకి జరిగి నిర్మించిన షెడ్డులను పూజ హోమ్స్ తొలగించింది. మట్టిని కూడా వెంటనే తొలగించాలని కమిషనర్ ఆదేశించారు. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని గొల్లవారి కుంట గురించి కమిషనర్ ఏవీ రంగనాథ్ గారు వాకబు చేశారు. మొత్తం 18 ఎకరాల చెరువు ప్రాంతంలో లే ఔట్ రావడాన్ని తీవ్రంగా పరిగణించారు. వెంటనే పూర్తి వివరాలు సమర్పించాలని రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల అధికారులకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News