జిహెచ్‌ఎంసి కార్యాలయం ఎదుట
కాంట్రాక్టర్ల ఆందోళన
రూ.1500 కోట్లకు చేరుకున్న
బకాయిలు కమిషనర్
చర్చలతో ప్రశాంతంగా
ముగిసిన ఆందోళన
మన తెలంగాణ/సిటీ బ్యూరో: తాము చేసిన పనులకు బిల్లులను వెంటనే చెల్లించాలని డి మాండ్ చేస్తూ కాంట్రాక్టర్లు చేపట్టిన ఆందోళన కాస్త ఉద్రిక్తతకు దారితీసింది. ఇద్దరు కాంట్రాక్టర్‌లు తమపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నంకు ప్రయత్నించారు. దీంతో అక్కడ ప రిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఏమి జరుగుతుందోనని ఆందోళన ఇటు కాంట్రాక్టర్లలో నూ, అటు అధికారుల్లోనూ మొదలైంది. దీం తో అక్కడే ఉన్న పోలీసులు రంగంలోకి దిగి కాంట్రాక్టర్లను అదుపులోకి తీసుకుని, పరిస్థితి ని చక్కబెట్టారు. అయినా.. రూ. 1500 కోట్ల బిల్లులను చెల్లించాలని కాంట్రాక్టర్లు ఆందోళన కొనసాగిస్తున్న నేపథ్యంలో జీహెచ్‌ఎంసి కమిషనర్ ఇలంబర్తీ కలుగజేసుకుని కాంట్రాక్టర్లను తమ చాంబర్ పిలిపించుకుని వారితో చర్చలు జరిపారు. ఫలితంగా కాంట్రాక్టర్లు ఆందోళన ను విరమించారు.
వివరాల్లో వెళ్ళితే.. గత ఏ డాది 2024 ఫిబ్రవరి మాసం నుంచి కాంట్రాక్టర్లకు జిహెచ్‌ఎంసి బిల్లులు చెల్లించడంలేదని, కనీసంగా ఆరుమాసాల బిల్లులలైనా చెల్లించాలని కంట్రాక్టర్లు డిమాండ్ చేస్తూ గురువారం జిహెచ్‌ఎంసి ప్రధాన కార్యాలయం ముందు మ. 1 గం.ల నుండి సా. 4 గం.ల వరకు ఆం దోళనను చేపట్టారు. అయితే, జీహెచ్‌ఎంసి అ ధికారుల నుంచి ఎలాంటి స్పందన రాకపోవ డం, కాంట్రాక్టర్లను కనీసం చర్చలకు పిలవకపోవడంతో ఆగ్రహానికి లోనైన ఇద్దరు కాంట్రాక్టర్లు ఖైరతాబాద్ జోన్‌కు చెందిన అరీఫ్ అహ్మ ద్, సౌత్ జోన్‌కు చెందిన మరో కాంట్రాక్టర్ ఇద్దరు తమతో తెచ్చుకున్న పెట్రోల్‌ను వంటిపై పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఇదంతా చూస్తూ అక్కడే ఉన్న పోలీసులు వెంటనే వంటిపై పెట్రోల్ పోసుకున్న వారిని అదుపులోకి తీసుకుని ఆత్మహత్య ప్రమాదం జరుగకుండా నివారించారు. అనంతరం డిసిపి జోక్యం చేసుకుని నేరుగా కమిషనర్ ఇలంబర్తీతో సంప్రదించిన అనంతరం నలుగురు కాంట్రాక్టర్లను చర్చలకు పిలిపించారు.
చెల్లింపులు మార్చి వరకు హామీ..
ఆరుగురు కాంట్రాక్టర్లు నేరుగా కమిషనర్ ఇలంబర్తితో చర్చలు జరిపారు. బిల్లులను జనవరి నుంచి జులై మాసం వరకు ఆరునెలల బిల్లులను వెంటనే చెల్లించాలని కాంట్రాక్టర్లు కమిషనర్ కోరారు. అయితే, కమిషనర్ స్పందిస్తూ. ప్రస్తుతం జీహెచ్‌ఎంసి ఆర్థిక పరిస్థితి ఏమిటి..? అనేది మీకు తెలియంది కాదు. మీకు జులై వరకు పెండింగ్ ఉన్న బిల్లులను వచ్చే మార్చి చివరినాటికి చెల్లింపులు జరిగే ప్రయత్నం చేస్తానని.. పూర్తిగా హామీనివ్వలేనని స్పష్టంచేసినట్టు సమాచారం. అయితే, రూ. 1500 కోట్లలో మార్చి చివరినాటికి ఆరుమాసాల బిల్లులు చెల్లించని పక్షంలో మళ్లీ ఆందోళనను చేపట్టి గ్రేటర్ పరిధిలో పనులు పూర్తిగా నిలిపివేస్తామని కాంట్రాక్టర్లు తేల్చిచెప్పారు. అందుకు కమిషనర్ ఇలంబర్తీ బదులిస్తూ.. ప్రతి నెల రూ. 100 కోట్లు బిల్లులు చెల్లించాల్సిందిగా ఈపాటికే ఆర్థిక విభాగం అధికారులను తాను ఆదేశించినట్టు వెల్లడించారు.
అయితే, బిల్లులు చెల్లింపులో జరుగుతున్న జాప్యాన్ని నివారించేందుకు ‘విజుబుల్ ఇన్స్‌పెక్షన్’ బాధ్యతలను జోనల్ కమిషనర్‌లకు అప్పగిస్తానంటూ ప్రకటించారు. అందుకు కాంట్రాక్టర్లు అంగీకరించలేదు. ఈపాటికే వర్క్ మానిటరింగ్ సిస్టం(డబ్లూఎంఎస్) ఉందని, ఇప్పుడు జోనల్ కమిషనర్‌చే విజిబుల్ ఇన్‌స్పెక్షన్ ఉంటే బిల్లులు మరింత జాప్యమవుతుందని కాంట్రాక్టర్లు వివరించారు. అయితే, ఇదివరకు ఉన్న వర్క్ మానిటరింగ్ సిస్టంలోనే జోనల్ కమిషనర్‌ను కూడా జాయిన్ చేస్తాను. మీకు బిల్లులు త్వరగా వచ్చేలా ఉంటుందని కమిషనర్ ఇలంబర్తీ చెప్పడంతో.. అందుకు కూడా కాంట్రాక్టర్లు అంగీకరించలేదు. కానీ, తప్పనిసరిగా విజిబుల్ ఇన్‌స్పెక్షన్ ఉంటుందని కమిషనర్ స్పష్టం చేవారు. అయితే, కాంట్రాక్టర్లు ఆ విషయం కాకుండా వచ్చే మార్చి నాటికి ఆరు మాసాల పెండింగ్ బిల్లులను చెల్లించాలని కోరారు. అందకు కమిషనర్ కూడా సానుకూలంగా స్పందించడంతో కాంట్రాక్టర్ల ఆందోళన ప్రశాంతంగా ముగిసింది.