- Advertisement -
చివ్వెంల: సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం ఐలాపురం వద్ద శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న లారీని బస్సు ఢీకొట్టడంతో ముగ్గురు మృతి చెందగా 17 మంది గాయపడ్డారు. కూలీలు ఒడిశా నుంచి హైదరాబాద్‌కు పనులకు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -