Friday, January 10, 2025

క్వార్టర్ ఫైనల్స్‌కు హర్యానా, రాజస్థాన్

- Advertisement -
- Advertisement -

n విజయ్ హజారే ట్రోఫీ
న్యూఢిల్లీ: దేశవాలి వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీలో రాజస్థాన్, హర్యానా జట్లు క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లాయి. గురువారం జరిగిన ప్రిలిమినరీ క్వార్టర్ ఫైనల్స్‌లో రాజస్థాన్, హర్యానా జట్లు విజయం సాధించాయి. తమిళనాడుతో జరిగిన పోరులో రాజస్థాన్ 19 పరుగుల తేడాతో విజయం సాధించగా.. బెంగాల్‌పై హర్యానా 72 పరుగుల తేడాతో గెలుపొందింది. రాజస్థాన్, హర్యానా జట్ల మధ్య జరిగిన రెండో ప్రిలిమినరీ క్వార్టర్ ఫైనల్-లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 47.3 ఓవర్లలో 267 పరుగులకు ఆలౌటైంది. స్టాస్పిన్నర్ వరుణ్ చక్రవర్తి 5 వికెట్లు తీసి రాజస్థాన్‌ను దెబ్బకొట్టాడు.

ఇక రాజస్థాన్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ అభిజీత్ తోమర్ (111) సెంచరీతో చెలరేగగా.. కెప్టెన్ మహిపాల్ లోమ్రార్ (60) అర్ధ సెంచరీతో రాణించాడు. కార్తీక్ శర్మ (35), సమర్పిత్ జోషి (15) మాత్ర మే రెండంకెల స్కోర్లు చేశారు. అనంతరం 268 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన తమిళనాడు 47.1 ఓవర్లలో 248 పరుగులకు ఆలౌటైంది. రాజస్థాన్ బౌలర్లలో అమన్ సింగ్ షెకావత్ మూడు వికెట్లు, అనికేత్ చౌదరీ, అజ య్ సింగ్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. ఖలీ ల్ అహ్మద్ ఓ వికెట్ దక్కించుకున్నారు. తమిళనాడు ఇన్నింగ్స్‌లో ఎన్ జగదీశన్ (65) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. బాబా ఇంద్రజిత్ (37), విజయ్ శంకర్ (49), మహ్మద్ అలీ (34) ఫర్వాలేదనిపించారు.

హర్యానా
అలవోక విజయం..
తొలి ప్రిలిమినరీ క్వార్టర్ ఫైనల్- మ్యాచ్‌లో బెంగాల్, హర్యానా హోరాహోరీ సాగించాయి. తొలుత బ్యాటింగ్ చేసిన హర్యానా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. అనంతరం లక్ష ఛేదనకు దిగిన బెంగాల్ 43.1 ఓవర్లలో 226 పరుగులకే ఆలౌటైంది. బెంగాల్ ఇన్నింగ్స్‌లో అభిషేక్ పోరెల్ (57) ఒక్కడే అర్ధ సెంచరీతో రాణించాడు. కెప్టెన్ సుదిప్ కుమార్ ఘరామీ (36), మజుందార్ (36), కరణ్ లాల్‌కు (28) కట్టుకున్నా మిగతావారు తేలిపోయారు. దీంతో 72 పరుగుల తేడా పరాజయాన్ని మూటగ్టుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News